అంబ‌టి రాంబాబుకు క‌ష్టాల సంబ‌రాలు... !

RAMAKRISHNA S.S.
- రాంబాబు నోటిదూల తీర్చేందుకు సిద్ధం
- ప‌వ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి బ‌ల‌య్యాడే
- ఎక్క‌డ దొరుకుతాడా అని చూస్తోన్న సేన‌, టీడీపీ శ్రేణులు
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
అంబ‌టి రాంబాబు. వైసీపీ మాజీ మంత్రి. స‌త్తెన‌ప‌ల్లి నుంచి ఘోరంగా ఓడిపోయిన నాయ‌కుడు. అయితే.. ఆయ‌న అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న వ్యంగ్య ప‌దాల‌తో విప‌క్షాల‌పై విరుచుకుప‌డిన విష‌యం తెలిసిం దే. అయితే.. కాలం క‌లిసి రాలేదు. న‌మ్ముకున్న పార్టీ చిత్తుగా ఓడిపోయింది. త‌ను న‌మ్ముకున్న చోట కూ డా.. ఆయ‌న‌కు అదే ప‌రాభ‌వం ఎదురైంది. ఫ‌లితంగా ఇప్పుడు మొహం ఎత్తుకోలేని ప‌రిస్థితి. పైగా.. అధికారంలో ఉండ‌గా.. ప‌వ‌న్‌ను , చంద్ర‌బాబును కూడా ఏకేశారు.

దీంతో ఇప్పుడు అంబ‌టి రాంబాబు.. ఇటు టీడీపీకి, అటు జ‌న‌సేనకు కూడా.. ప‌క్కా టార్గెట్ అవుతున్నార నడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్క‌డ ఎప్పుడు మాట్లాడినా.. ప‌వ‌న్‌నుతీవ్రంగా విమ‌ర్శించారు అంబ‌టి. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పేరులోనే క‌ల్యాణం ఉంద‌ని.. కాబ‌ట్టి మూడు పెళ్లిళ్లు చేసుకున్నార‌ని.. ఒక్క‌రికి కూడా న్యాయం చేయలేక పోయార‌ని ఆయ‌న దెప్పిపొడిచిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు.. ప‌వ‌న్ వార్డు మెంబ‌రుగా కూడా.. ప‌నిచేయ‌ర‌ని వ్యాఖ్యానించారు.

ఇక చంద్ర‌బాబుపై ఆయ‌న వ‌య‌సు అయిపోయింది.. వృద్ధాశ్ర‌మానికి పంపించే స‌మ‌యం వ‌చ్చింద‌ని అంటూ.. త‌వ్ర స్తాయిలో వ్యాఖ్య‌లు చేశారు. అలాగే.. నారా లోకేష్‌ను కూడా తీవ్రంగా విమ‌ర్శించారు. ఇక‌, సంక్రాంతి స‌మ‌యంలో డ్యాన్సులు వేయ‌డాన్ని స‌మ‌ర్ధించుకున్నారు. ఇలా.. రాంబాబు త‌న నోటి దూల‌ను ప్ర‌ద‌ర్శించారు. అయితే.. ఇప్పుడు ఓడ‌లు బ‌ళ్ల‌య్యాయి. వైసీపీ చిత్తుగా మారిపోయింది. దీంతో అంబ‌టి.. అటు టీడీపీకి, ఇటు.. జ‌న‌సేన‌కు కూడా.. టార్గెట్ అయిపోయింది.

ఇరు ప‌క్షాలు కూడా.. క‌త్తులు దూస్తున్నాయి. ఆర్థికంగా దెబ్బ‌తీసేందుకు పెద్ద‌గా రాంబాబు సంపాయించు కోక‌పోయినా.. ఆయ‌న వ్య‌వ‌హార శైలి.. దూకుడును మాత్రం ఖ‌చ్చితంగా తొక్కేస్తారు. నోటి దూల కూడా తీర్చేస్తారు. ముఖ్యంగా జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిగా ఆయ‌న ఏం చేసిందీ తీస్తారు. ఆయ‌న అవినీతి చేసి ఉంటే.. ఖ‌చ్చితంగా బ‌య‌ట పెట్ట‌డ‌మే కాకుండా.. చ‌ర్య‌లు తీసుకున్నా ఆశ్చ‌ర్యం లేదు. ప‌వ‌న్ కుటుంబాన్నివిమ‌ర్శించిన నేప‌థ్యంలో జ‌న‌సేన నుంచి మ‌రింత ఎక్కువ‌గానే దాడులు ఉండే అవ‌కాశం ఉంది. ఎక్క‌డ ఎప్పుడు మాట్లాడినా.. ప‌వ‌న్‌నుతీవ్రంగా విమ‌ర్శించారు అంబ‌టి. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పేరులోనే క‌ల్యాణం ఉంద‌ని. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: