తెలంగాణ: సీతక్క, కొండా సురేఖ మధ్య కొత్త లొల్లి.. భలే ఫ్లేట్ ఫిరాయించారు గా..??

Suma Kallamadi
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎలక్షన్స్‌లో దన్సరి అనసూయ అలియాస్ సీతక్క ములుగు ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు. మరోవైపు వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొండా సురేఖ గెలిచారు. ఆమె తెలంగాణలో కేబినెట్ మంత్రి కూడా అయ్యారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో పర్యావరణం, అటవీ శాఖలు, ఎండోమెంట్ శాఖలకు మంత్రిగా నియమితులయ్యారు. సీతక్క, కొండా సురేఖ ఇద్దరూ కూడా ఒకే పార్టీకి చెందినవారు కానీ వీరి మధ్య ఇప్పుడు పెద్ద లొల్లి మొదలైంది. ఒకప్పుడు నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అని లోపల అనుకునేవారు కానీ ఇప్పుడు బహిరంగంగానే వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
సాధారణంగా దేవాదాయ శాఖ మేడారం జాతరను నిర్వహిస్తుంది. జాతర ఏర్పాట్లు అన్నీ కూడా ఆ శాఖే చూసుకోవాలి కానీ మేడారం తన నియోజకవర్గంలో ఉంది కాబట్టి సీతక్కే జాతర వేడుకలను జరిపారు. అయితే ఈ వేడుకల సంబంధించి ఒకటి, రెండు మీటింగులకు వెళ్లడంతో సరిపెట్టారు కొండా సురేఖ. ఆమె దేవాదాయ శాఖకు మంత్రి అయినా కూడా పెద్దగా జాతరకు వెళ్లలేదు. ఇక ధార్మిక భవన్‌ విషయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. మేడారం సమ్మక్క సారక్క ఈవో ఆఫీస్ దేవాదాయ శాఖ భవనం (ధార్మిక భవన్‌)లో ఉంది. అయితే ఈ భవనం నుంచే కొన్ని పనులు అదనంగా చేయాలని దేవాదాయ శాఖ వాళ్లు అనుకుంటున్నారట. అయితే సీతక్కవైపు ఉన్న వారు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
 ఇది ఇలా ఉండగా వరంగల్ ఇన్చార్జిగా ఉన్న కొండా సురేఖను మెదక్ పంపించారు. దీని వెనుక సీతక్క హస్తం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు వీరి మధ్య అనురాగం, ఆప్యాయత కనిపించింది కానీ తర్వాత ఇద్దరి మధ్య చాలానే శత్రుత్వం పెరిగిపోయినట్లు తెలుస్తోంది. మరి వీరి లొల్లి ఇంకా ఎంత పెద్దది అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: