జగన్: రాజ్యసభ లోక్ సభ నేతలతో భేటీ.. ఎందుకంటే..?
అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సారి నేతలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టుగా భేటీ అవుతున్నారు. తాజా ఎన్నికలలో వైసిపి ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకునే అవకాశం ఉన్నది. అలాగే ఎన్నికల ఫలితాలు అనంతరం రాష్ట్రంలో వైసిపి నేతలపైన కార్యకర్తల పైన అధినేతల ఇళ్ల పైన కూడా దాడులు జరగడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడబోతున్నారు. అలాగే అందరికీ కూడా అండగా ఉంటానని ఈ దాడులలో ఇబ్బంది పడిన కార్యకర్తలకు సైతం పార్టీ సపోర్టుగా ఉంటుందని తెలిపారు.
మరి కొన్ని రోజులలో ప్రారంభం అయ్యేటువంటి పార్లమెంటు సమావేశాలలో కూడా అనుసరించాల్సిన అంశాల పైన చాలా కసరత్తులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వైసిపి ఎంపీలు రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాలి అంటూ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనలు ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ మరింత పుంజుకొనే అవకాశం ఉంటుందనే విధంగా కార్యకర్తలు నేతలు సైతం తెలియజేస్తున్నారు. అలాగే ప్రజలలో కూడా తమ పార్టీ చేసిన మంచి అలాగే ఉందని 40% ఓటింగ్ మాత్రం వైసిపి పార్టీకి ఎన్ని పార్టీలు కలిసిన తగ్గించలేకపోయాయని ధీమాతో తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వైసిపి అధినేత చూడాలి.