టీడీపి: గుడ్ న్యూస్.. గవర్నర్ పదవి కూడా..?
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ల పదవీకాలం ముగిస్తూ ఉండడంతో కొత్త గవర్నర్లను సైతం నియమించడానికి టిడిపికి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలని భావనతో బిజెపి అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎవరి పేరు సూచిస్తారు అనే విషయం పైన ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2014లో టిడిపి ఎన్డీఏ కూటమిలో భాగమై అయినది. అప్పట్లో ఆ పార్టీకి గవర్నర్ పదవి దక్కుతుందని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది కానీ అక్కడ నిరుత్సాహం ఏర్పడింది.
ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీలో మరొకసారి భాగమైనందు వలన టిడిపికి గవర్నర్ పోస్ట్ కేటాయించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గవర్నర్ పదవికి సీనియర్లు అనుభవిగ్యులైన వారిని ఎంపిక చేసే విధంగా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నట్లు టిడిపి తమ్మల్లలో నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పదవికి మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్లు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒక పేరును చంద్రబాబు సైతం ఫైనల్ చేసే విధంగా ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు ఇది ఎంత మటుకు నిజమో అవుననే విషయం పైన నేతలు సైతం క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది.