ఆ లెక్కలు బయటకు తీయనున్న చంద్రబాబు.. ఈ దెబ్బతో ఆంధ్ర భవిష్యత్తు మారానుందా..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు నిన్న ఎంతో మంది రాజకీయ , సినీ ప్రముఖుల మధ్యలో ప్రమాణ స్వీకారం చేశారు. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఫైల్స్ పై సంతకాలు చేస్తారు అని చాలా మంది అనుకున్నారు. కానీ సమయం లేకో .. లేక దేశ ప్రధాన మంత్రి అయినటువంటి మోడీ వచ్చినందుకు ప్రోటో కాల్స్ పాటించవలసి ఉండడం వల్లో , మరే కారణాల వల్ల తెలియదు కానీ చంద్రబాబు నాయుడు నిన్న ప్రమాణ స్వీకారం రోజు ఏ ఫైల్ పై కూడా సంతకాలు చేయలేదు.

దానితో ఈ రోజు ఆయన ఐదు ఫైల్స్ పై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటే స్కిల్స్ సెన్సెక్స్. అసలు దీని ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే వాలెంటీర్స్ ద్వారా ఎవరింట్లో ఎంత మంది ఉన్నారు. వారు ప్రస్తుతం ఏమి చేస్తున్నారు. అలాగే ఆ ఇంట్లో ఉన్న వారిలో ఎవరికి ఏ స్కిల్స్ ఉన్నాయి అనే దానిని ఒక డాటా రూపంలో స్వీకరిస్తారు.

ఆ సేకరించిన డాటా ప్రకారం వారికి ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ కి సంబంధించిన ఉద్యోగాలు ఇప్పించడం , లేకపోయినట్లు అయితే ఏదైనా కంపెనీ రాష్ట్రానికి వచ్చినట్లు అయితే వారికి ఏ స్కిల్ ఉన్నవారు అవసరం ఉంటే ఆ స్కిల్ ఉన్నవారిని ఆ కంపెనీకి చూపించడం , వారికి ఉద్యోగాలు కల్పించడం లాంటివి చేయడం మరియు ప్రస్తుతం ఉన్న స్కిల్స్ ని మరింత పెంపొందించడం కోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించడం ఇలా అనేక విషయాలలో వారికి కొత్త అవకాశాలను కల్పించడం కోసం చంద్రబాబు నాయుడు ఈ స్కిల్ సెన్సెస్ అనే ఒక ఫైల్ పై సంతకం చేయనున్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఈ కొత్త పద్ధతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి చంద్రబాబు నాయుడు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: