బాబుని ఏమీ అనకుండా జగన్ ని ఆపుతుందెవరు.. అసలేం జరుగుతుంది?

praveen
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు పది రోజులు గడిచిపోతున్నాయి. జగన్ చేతిలో నుంచి అధికారం చేజారి పోయింది అన్న విషయం తెలిసి కూడా అదే పది రోజులు అవుతుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం కూడా కొలువ తీరింది. ఇంత జరుగుతున్న మొన్నటి వరకు సీఎంగా ఇక ఇప్పుడు విపక్ష నేతగా కొనసాగుతున్న జగన్ మాత్రం సైలెంట్ గా ఉండిపోవడం ఎన్నో కొత్త చర్చలకు తావిస్తోంది. అయితే టిడిపి అధికారంలోకి రాగానే కొంతమంది కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.

 వైసీపీ క్యాడర్ మీద చాలా చోట్ల దాడులు జరుగుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. మరోవైపు వైసీపీకి ఆరాధ్య దైవం అయిన వైయస్సార్ విగ్రహాలను కూడా కూల్చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్న అటు జగన్ మాత్రం నోరు విప్పడం లేదు. న్యాయపోరాటం, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం అంటున్నారు తప్ప.. టిడిపిని టార్గెట్ చేస్తూ విమర్శించడం మాత్రం చేయడం లేదు. ఎంతసేపు ఎందుకు ఓడిపోయామో తెలియట్లేదు అంటున్నారు తప్ప చంద్రబాబును ఉద్దేశించి మాత్రం కామెంట్స్ చేయట్లేదు. అయితే 2014లో టిడిపి గెలిచి వైసిపి ఓడి పోయినప్పుడు జగన్ తీరు ఇలా లేదు. ఏకంగా మీడియా ముందుకు వచ్చి ఎంతో అగ్రెసివ్ గానే మాట్లాడారు.

 కానీ ఎందుకు ఇప్పుడు జగన్ అలా మాట్లాడలేకపోతున్నారు అన్నది అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే 2019లో వైసీపీ గెలిచినప్పుడు చంద్రబాబు ఊరుకోలేదు. ఈవీఎంలను  ట్యాంపరింగ్ చేశారని అందుకే గెలిచారు అంటూ విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పుడు జగన్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు  అయితే కొత్త ప్రభుత్వం కొలువు దీరి కొన్ని రోజులైన తర్వాత ఇచ్చిన హామీలను మరిచిందని కాస్త లేటుగా విమర్శలు చేద్దామని అనుకుంటున్నారేమో అని చర్చ జరుగుతుంది.


 మరోవైపు వైసీపీకి నలుగురు పార్లమెంట్ సభ్యులు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. దీంతో ఈ 15 మంది ఎంపీలతో బిజెపికి మద్దతు ఇవ్వాలని ఆలోచనలోనే జగన్ ఉన్నారట. ఇక ఇప్పుడు కూటమిలో అటు బిజెపి కూడా ఉంది. కాబట్టి ఇక గబుక్కున కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేయడానికి జగన్ ముందుకు రావడం లేదు అన్న చర్చ కూడా సాగుతోంది. లేదంటే జగన్ ను బాబుపై విమర్శలు చేయకుండా ఉండడానికి ఎవరైనా అడ్డుకుంటున్నారా.. తెర వెనుక ఎవరు ఉన్నారు అనే చర్చ కూడా మొదలైంది. వీటన్నింటికీ రానున్న రోజుల్లో సమాధానం దొరుకుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: