చంద్ర బాబు: సచివాలయాలల్లో పెను మార్పులు..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజున ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. గన్నవరం సమీపంలో కేసరపల్లి ఐటి పార్క్ వద్ద ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు నేతలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉండడం ఇది ఆంధ్రప్రదేశ్లో రెండవసారి.. మొత్తం మీద చూసుకుంటే నాలుగవసారి. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రుల ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వారి జాబితాను సైతం సిద్ధం చేసి ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాలలో పవన్ కళ్యాణ్ పేరును అలాగే జనసేన నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు కూడా తీసుకున్నట్లు సమాచారం.

ఇందులో ముఖ్యంగా నాదెండ్ల మనోహర, కందుల దుర్గేష్ ను కూడా మంత్రివర్గంలో చోటు దక్కించేలా చేశారు.అలాగే బిజెపి నుంచి వై సత్య కుమార్ ని కూడా తీసుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పరిపాలన పైన దృష్టి సాధించనున్నారు. మొదటి సంతకం మెగా డీఎస్సీ పైన ఉండవచ్చు అని ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ ,వార్డు సచివాలయాలలో కూడా బారి మార్పులు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా అక్కడ సిబ్బందిని ఇతర అనుబంధ శాఖలోకి సర్దుబాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారట. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5 వారికి ఆ సంబంధిత వాటిలో బాధ్యతలను అప్పగించేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. అలాగే అత్యధిక సంఖ్యలో గ్రేడ్ -5 కార్యదర్శులను గ్రేడ్-4 గా ప్రమోషన్ కల్పించబోతున్నారు. సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లోకి చేరవేసేందుకు వీళ్లే చాలా కీలకంగా పోషించబోతున్నట్లు సమాచారం.

అలాగే డిజిటల్ అసిస్టెంట్లను జూనియర్ అసిస్టెంట్లు కం కంప్యూటర్ ఆపరేటర్ గా బదలాయించబోతారని అలాగే విద్యా శాఖకు మార్చే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పనులను వారికే కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారట. హై స్కూల్ కు ఒక్కొక్కరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్లను కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉపాధ్యాయులను ఇలాంటి వాటి నుంచి తప్పించి ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇది వారికి కాస్త ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: