బాలయ్య కోసం భారీ గిఫ్ట్.. బాబుకి బావమరిదంటే ఎంత ప్రేమో?

praveen
ఇటీవల ఆంధ్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అఖండ విజయం సాధించింది. ఈ క్రమంలోనే రేపు చంద్రబాబు ఎంతోమంది అతిరథ మహారథుల మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే సమయంలో ఎంతోమంది కీలక నేతలకు అటు మంత్రి పదవులను కూడా కట్టబెట్టబోతున్నారు అనే విషయం తెల్సిందే  ఈ సమయంలోనే ఏకంగా టిడిపి పార్టీ తరఫున హ్యాట్రిక్ కొట్టిన చంద్రబాబు తన వియ్యంకుడు అయిన నందమూరి బాలయ్యకు ఈసారి మంత్రి పదవి దక్కుతుందా అనే విషయంపై చర్చ సాగుతోంది.

 అయితే 2014 నుండి మొదలుపెట్టి 2024 వరకు బాలయ్య హిందూపురంలో వరుసగా విజయం సాధిస్తూనే వస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక అంతకంతకు మెజారిటీ కూడా పెంచుకుంటున్నారు  జగన్ వేవ్ సమయంలో కూడా 17వేల ఓట్ల తేడాతో గెలిచి సత్తా చాటారు  దీంతో ఇలా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన బాలయ్యకు ఈసారి మంత్రి పదవి పక్క అంటూ ప్రచారం జరుగుతోంది. హిందూపురంలో ఇక బాలయ్య పోటీ చేశారు అంటే గెలుపు పక్క అనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో వచ్చేస్తుంది అని చెప్పాలి. అయితే మొదటిసారి బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మినిస్ట్రీ పక్క అని ఎంతో ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు  ఇక 2019లో టిడిపి ప్రతిపక్ష హోదాకే పరిమితమైంది.

 అయితే ఇక ఇప్పుడు 2024 లో అఖండ విజయం సాధించి టిడిపి మరోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బాలయ్యకు ఇక మంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందే అంటూ డిమాండ్లు కూడా తెరమీదకి వస్తున్నాయి. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా  నుంచి తీవ్రమైన పోటీ ఉంది  పరిటాల సునీత, పయ్యావుల కేశవ వంటి వారు రేసులో ఉన్నారు. అలాగే ధర్మవరం నుంచి గెలిచిన బిజెపి నేత సత్యకుమార్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు అని చెప్పాలి. అయితే ఈ రాజకీయ సామాజిక లెక్కలు ఎన్ని ఉన్నా తన బావమరిది అయిన బాలయ్యకు అన్ని విషయాల్లో మినహాయింపు ఇచ్చి ఇక మంత్రిని చేసి ఒక భారీ గిఫ్ట్ ను బాలయ్యకు ఇవ్వబోతున్నారట చంద్రబాబు. మరోవైపు బాలయ్య సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: