ప్రమాణ స్వీకార వేదిక మార్చి.. చంద్రబాబు ఇచ్చే సంకేతం ఇదా...!
గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లిలో ఉన్న ఐటీ పార్క్‌లో బాబు ప్రమాణ స్వీకారానికి ఏ ర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు 80 వేల మంది కూర్చునేందుకు ఈ పార్కులో సౌకర్యం ఉంది. అదేవిధంగా మరో లక్ష మంది నిలబడి వీక్షించేందుకు కూడా అవకాశం ఉంది. ఇక, కారు పార్కింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాటు చేశారని కొందరు చెబుతున్నారు. కానీ, దీనిపై మరో కీలక వాదన కూడా వినిపిస్తోంది.
విజయవాడను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. ఈ క్రమంలోనే కేసరపల్లిలో ఐటీ పార్కును నిర్మించారు. అయితే, ఆయన అకాల మరణం చెందడంతో ఈ పార్కు పనులు నిలిచిపోయాయి. తర్వాత ముఖ్యమంత్రులు పెద్దగా దీనిని పట్టించుకోలేదు. ఇక, వైఎస్ కన్నబిడ్డే ఈ రాష్ట్రాన్ని పాలించినా.. ఆయన కానీ, మంత్రులు కానీ.. ఈ విషయాన్ని పట్టించుకోకవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అనూహ్యంగా చంద్రబాబు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం సంచలనంగా మారింది.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేంద్రంలోని పెద్దలు తరలి వస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇతర రాష్ట్రా లముఖ్యమంత్రులు కూడాతరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ పార్కు వ్యవహారం.. జాతీయ స్తాయిలో మెరిసే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందుకే ఏరికోరి అమరావ తిని కాదని మరీ కేసరపల్లి ఐటీ పార్కును ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా తాను అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నానన్న సంకేతాలు ఇచ్చినట్టు అయిందని చెబుతున్నారు.