చంద్రబాబు: "బై బై బెంగళూర్. హలో హైదరాబాద్".. రూపురేఖలు మార్చిన ఘనత బాబుదే..!

Divya
•అతిపెద్ద మహానగరంగా హైదరాబాద్ ను మార్చిన ఘనత బాబుదే
•తన హయాంలో 3 లక్షల 20వేల మందికి ఉపాధి
•దళిత వర్గాలను,  శాస్త్రవేత్తలను రాజకీయాల్లో భాగం చేసిన ఘనత బాబుదే..
(ఆంధ్రప్రదేశ్ - హైదరాబాద్ -ఇండియా హెరాల్డ్ )
ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని.. ఒకానొక సమయంలో బెంగళూరు , చెన్నై వంటి ప్రాంతాలు అభివృద్ధిలో వేగంగా ముందుకు వెళ్తుంటే.. ఆంధ్ర ప్రజలు కూడా అక్కడికి వెళ్లి తమను మరింత అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నాలు చేశారు.. ఇక యువత మొత్తం ఉద్యోగం పేరిట బెంగళూరు,  చెన్నై వంటి ప్రాంతాలకు తరలిపోతుంటే ఆంధ్ర అభివృద్ధి ఎప్పటికీ జరగదు అని ఆలోచించిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు "బై బై బెంగళూర్.. హలో హైదరాబాద్" అంటూ ఒక నినాదాన్ని తీసుకొచ్చారు.. దీంతో  మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ను స్థాపించింది.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సీయాటెల్ నగరంలో ఉన్న సంస్థ.. ఆ తర్వాత హైదరాబాద్ రెండవ కేంద్రంగా మారడానికి నారా చంద్రబాబునాయుడు కీలకపాత్ర పోషించారు.
అంతేకాదు ప్రముఖ ఐటీ కంపెనీలైన ఐబీఎం, డెల్ , డెల్ ఇట్ట్, కంప్యూటర్ అసోసియేట్స్ అండ్ ఒరాకిల్ వంటి కంపెనీలను హైదరాబాదులో నెలకొల్పడానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సీఈఓ లను ఒప్పించేందుకు నానా ప్రయత్నాలు చేశారు.. ఇక అతని పదవీకాలం చివరిలో 2003 - 2004 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నుండి సాఫ్ట్వేర్ ఎగమతులు వన్ బిలియన్ డాలర్ కు చేరుకున్నాయి.  అంతేకాదు దేశంలో నాలుగవ అతిపెద్ద ఎగుమతి నగరంగా కూడా హైదరాబాద్ను తీర్చిదిద్దిన ఘనత బాబుకే సొంతం.. ఇక 2013 -  2014లో ఎగుమతులు 100 రెట్లు పెరిగాయి.. దీని ఫలితంగా హైదరాబాదులో ఐటి మరియు ఐటిఈఎస్ రంగాలలో సుమారుగా 3,20,000 మందికి ఉపాధి లభించడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.

ఇకపోతే రాష్ట్రపతిగా దళిత వర్గానికి చెందిన నారాయణను ఎంపిక చేయడానికి చంద్రబాబు చొరవ  తీసుకున్నారు. ఆ తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవి ఇవ్వాలి అని వాజ్పేయి భావించగా.. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం పేరును కూడా చంద్రబాబే ప్రతిపాదించారు.. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని.. కలాం కి నచ్చజెప్పి మరి ఒప్పించారు.. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా చేసిన కృష్ణ కాంత్ ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.. ఇక ఇప్పుడు అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని మాది అని చెప్పుకుంటున్న తెలంగాణ వాసులు.. ఈ నగరాన్ని చెన్నై, బెంగళూరు  వంటి ప్రాంతాలతో పోటీపడేలా  తీర్చిదిద్దిన చంద్రబాబుకు ఎప్పుడు రుణపడి ఉంటారనటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: