ఏపీలో ఫ్రీ బస్సు స్కీమ్‌ అమలయ్యేది అప్పుడే...??

Suma Kallamadi
2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి 164 అసెంబ్లీ సీట్లు కైవసం చేస్తుంది. ఎంపీ సీట్లు కూడా ఎక్కువగానే గెలుచుకొని కేంద్రంలో కింగ్ మేకర్ గా మారింది. “సూపర్ సిక్స్” కారణంగానే టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సూపర్ సిక్స్ గ్యారెంటీలలో ఆడవారికి బస్సు ఫ్రీ అని ఇచ్చిన హామీ బాగా సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్ కూడా ఇలాంటి హామీ ఇచ్చి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. దీన్నే చంద్రబాబు కూడా తన మేనిఫెస్టోలో ప్రధమంగా చేర్చారు. దాని కారణంగా ఆయన విజయం సాధించడం సాధ్యమైంది. దీనిని అన్ని ప్రభుత్వాలు కూడా విజయవంతంగానే అమలు చేస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు కూడా అమలు చేస్తారని చాలామంది ఆడవారు ఓట్లు వేశారు.
 ఇప్పుడు ఏపీ ఆడవాళ్ళందరూ కూడా ఈ ఉచిత బస్సు స్కీమ్ ఉపయోగించుకోవాలని బాగా ఆశపడుతున్నారు. ప్రస్తుతానికైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయలేదు. సీఎం అయ్యాక ఆయన మొట్టమొదటగా ఇదే హామీ నెరవేర్చే అవకాశం ఉంది. అయితే ఈ హామీని ఎలా నెరవేర్చాలనే దానిపై సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
 ఓన్లీ పల్లె వెలుగు బస్సులకు ఫ్రీ ట్రావెల్ అందించాలా లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణించే బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణాన్ని అందించాలా అనే కోణంలో ఆలోచిస్తున్నారట. ఫ్రీ బస్సు కారణంగా టాక్సీలు, ఆటో డ్రైవర్లకు చాలా నష్టం కలుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో అదే జరిగింది. అయితే చంద్రబాబు మాత్రం ఇలాంటి నష్టాలు ఎవరికీ కలవకుండా ఉండేలాగా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తే ఆర్టీసీకి ఎంత భారం పడుతుంది అనే కోణంలో కూడా లెక్కలు వేస్తున్నారట.
 దీనిని అమలు చేస్తున్న ప్రభుత్వాలతో చర్చలు కూడా జరుపుతున్నారట. అయితే దీనిని రెండు మూడు నెలల్లో అమలు చేసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దసరా కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని మరి కొంతమంది అంటున్నారు. ఆధార్ కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం మొదటగా కల్పిస్తారు. ఆ తర్వాత జీరో టికెట్టు అందిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: