చంద్రబాబు ప్రమాణ స్వీకారం అక్కడే..?

Pulgam Srinivas
తెలుగు దేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు కి ఇప్పటికే చాలా సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇకపోతే ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న సమయంలో కూడా చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక 2014 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో కూడా తెలుగు దేశం పార్టీకి భారీ మొత్తంలో అసెంబ్లీ స్థానాలు రావడంతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మొదటి ముఖ్య మంత్రి గా పని చేశారు. ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం తెలుగు దేశం పార్టీ కి పెద్ద సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు రాలేదు.

ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. వీటిలో తెలుగు దేశం పార్టీ కి భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలు దక్కాయి. దానితో మరో సారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇకపోతే చంద్రబాబు నాయుడు ఏ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనే విషయం పై అనేక వార్తలు బయటకు వస్తున్న టి డి పి బృందం మాత్రం అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేయడం లేదు.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు మంగళగిరి లోని ఎయిమ్స్ వద్ద విశాలమైన స్థలంలో ఈ నెల 12 వ తేదీన ప్రమాదం స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం టి డి పి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి అచ్చేన్నాయుడు , ఇతర నేతలు ఈ స్థలాన్ని పరిశీలించినట్లు నేడో , రేపో ఈ వేదికను అధికారికంగా పార్టీ ప్రకటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎం లు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: