జగన్: ప్రతిపక్ష హోదా ఉండదా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో ఇటీవలె వెలువడిన ఫలితాలలో వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ముఖ్యంగా ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. దీంతో ఇప్పుడు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. గతంలో 23 స్థానాలు సంపాదించుకున్న చంద్రబాబుని విమర్శించుకుంటూ వచ్చారు. అయితే చాలామంది ఆ సమయంలో కూడా తమ పార్టీలోకి వస్తామని చెప్పినా కూడా తాను ప్రతిపక్ష హోదా ఉండాలని ఆలోచించే వదిలేసానని కూడా తెలియజేశారు. అసలు ఇప్పుడు జగన్కు ప్రతిపక్ష పాత్ర ఇస్తారా అనే విషయం పెద్ద క్వశ్చన్ గా మారింది.

కేవలం వైసీపీ పార్టీ 11 స్థానాలు దక్కించుకుంది. ప్రతిపక్ష పాత్ర ఉండడానికి అవకాశం లేదు.. మామూలుగా 18 స్థానాలు ఉండాలి. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ప్రతిపక్ష హోదా ఉంటే ..అలాగే క్యాబినెట్ ఉంటుంది ప్రోటోకాల్ కూడా ఉంటుంది. అలాగే అసెంబ్లీలో మాట్లాడే సమయం కూడా నిమిషాలలో ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇప్పుడు రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువగా సమయం ఇవ్వారని తెలుస్తోంది. అదే సందర్భంలో ప్రోటోకాల్ ప్రకారం ఎన్ని పోస్టులు ఉన్నాయో సాధారణంగా ప్రతిపక్షం పార్టీ ఉంటే పెద్ద రూము కేటాయిస్తారు కానీ ఇప్పుడు చిన్న రూమ్ కేటాయిస్తారట.

మొత్తంగా చూసుకుంటే సెక్యూరిటీ కూడా తగ్గిపోతుంది.. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండే సెక్యూరిటీ మాత్రమే ఉండిపోతుంది. టిడిపి లాగా రాజ్యసభలో ఒక్క సీటు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే చాలా కీలకమైనటువంటి అంశము. ఇప్పటికే వైసీపీ నేతలతో జగన్ మాట్లాడి రాబోయే రోజుల్లో ఎలాంటి అంశాల పైన ప్రజలలోకి వెళ్లాలని విషయం పైన కూడా మరొకసారి చర్చించుకుంటున్నట్లు నిన్నటి రోజున వార్తలు వినిపించాయి. చాలామంది నేతలు చంద్రబాబు చెప్పినటువంటి మేనిఫెస్టో అమలు చేయాల్సి ఉంటుందని లేకపోతే ప్రజలే తిరగబడతారని కూడా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: