పవన్: తనకు కావలసిన శాఖలు ఇవేనట.. డిమాండ్ మామూలుగా లేదా..!

Divya
ఆంధ్రప్రదేశ్లో టిడిపి పార్టీ భారీ ఘన విజయాన్ని అందుకుంది. అందుకు జనసేన పార్టీ మద్దతు ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జనసేన పార్టీ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని చాలామంది నేతలు కూడా తెలియజేస్తున్నారు. వైసిపి పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయేలా చేసింది. ఎన్నికల విజయం సాధించిన తర్వాత చాలామంది అటు కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అయితే ఇలాంటి సమయంలోనే మంత్రివర్గ పైన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ప్రాథమిక దశలో కొన్ని ఉన్నాయని అవన్నీ ఒక కొల్లికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కీలకమైన మంత్రిత్వ శాఖలు ఎవరికి దక్కుతాయని విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తండ్రి గతంలో కానిస్టేబుల్ కావడం వల్ల ఎన్నో సందర్భాలు పోలీసు వృత్తి అంటే ఇష్టం ఉందని కూడా వెల్లడించారు. దీంతో పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా హోం మంత్రి శాఖ ఇస్తారని వైరల్ గా మారాయి .అయితే పవన్ కళ్యాణ్ కు ఈ శాఖ అంటే ఇష్టం లేదని కేవలం తనకు పర్యావరణ కాలుష్య నివారణ పైనే పనిచేయాలని ఉందని ఒక జాతీయ మీడియాతో పంచుకున్నట్లు సమాచారం.

కాలుష్యం అనేది దేశానికి అత్యంత ప్రమాదమని మనిషి జీవితాన్ని కూడా నాశనం చేస్తుందని దీనివల్ల వాతావరణంలో చాలా రకాల మార్పులు కూడా వస్తాయని అందుకే కాలుష్య స్థాయిని రోజు రోజుకి పెరగడం వల్ల అకాల వర్షాలు అకాల కరువు వస్తూ ఉంటుంది వీటన్నిటిని నివారించాలి అంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలని చెప్పవచ్చు. అలాగే రైతులకు ఉపయోగపడేటువంటి ఇరిగేషన్ శాఖ పైన కూడా పని చేయాలని ఉందని పవన్ కళ్యాణ్ తెలియజేసినట్లు సమాచారం. మరి పవన్ కళ్యాణ్ రైతులకు ప్రజలకు ఉపయోగపడేటువంటి శాఖలను ఎంచుకోవడంతో పలువురు అభిమానులు సైతం సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఎలాంటి శాఖను తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: