జీరో సీట్లపై.. కేటీఆర్ రియాక్షన్ ఏంటో తెలుసా?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరుగులేని పార్టీగా ఎదిగిన బిఆర్ఎస్ ఇక ఇప్పుడు పతనం అయ్యే స్థాయికి చేరుకుందా అంటే ప్రస్తుతం అందరూ అవును అనే సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని  హ్యాట్రీక్ కొడతాం అనుకున్న గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు షాక్ ఇచ్చారు. అధికారం నుంచి తొలగించి ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారు. సరే రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని ఆ పార్టీ నేతలు అనుకునే లోపు.. కారు పార్టీలో అల్లకల్లోలమే జరిగిపోయింది.

 ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలకమైన నేతలు పార్టీని వీడి  అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కెసిఆర్ నమ్మిన బంటులు సైతం ఇలా కారు దిగి వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి మెజారిటీ స్థానాలలో విజయం సాధిస్తే.. ఉన్న నేతలను కాపాడుకోవచ్చు అని గులాబీ దళపతి కేసీఆర్ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో పార్లమెంటు ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు కెసిఆర్ ను అస్సలు నమ్మలేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ కు ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో ఎగ్జాక్ట్ గా మారిపోయాయి.  ఒకప్పుడు ప్రతిపక్షమే లేకుండా ప్రతి ఎన్నికల్లో కూడా మెజారిటీ సాధించిన బిఆర్ఎస్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా దక్కని పరిస్థితి నెలకొంది.

 దీంతో ఈ పరాజయాన్ని బిఆర్ఎస్ శ్రేణులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇటీవల వెలువడిన ఫలితాలలో బిఆర్ఎస్ పార్టీ డక్ అవుట్ అవడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత 24 ఏళ్లలో అనేక ఒడిదుడుకులు, మధురమైన విజయాలను చూసాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తమకు అతిపెద్ద మైలు రాయి. 2014లో 119 స్థానాలకు 63, 2018లో 88 స్థానాలు గెలుచుకొని వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము. ప్రస్తుత 119 స్థానాల్లో 39 సీట్లలో అంటే ఒకటిలో మూడోవంతుతో తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయ్. కానీ రానున్న కాలంలో బూడిదలో నుంచి లేచిన ఫీనిక్స్ పక్షుల తప్పకుండా పైకి లేస్తాం అంటూ కేటీఆర్ ఆశ భావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Brs

సంబంధిత వార్తలు: