గెలుపు తర్వాత.. అలా మాట్లాడిన లోకేష్..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాలకు నిన్నటి రోజున ఎట్టకేలకు తెరపడింది.. భారీ విజయంతో టీడీపీ పార్టీ అత్యధిక మెజారిటీతో కూడా గెలుపొందడం జరిగింది. నిన్నటి రోజున ఫలితాలు వెలుబడిన తర్వాత అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు టిడిపి నేతలు సైతం పలు మీడియా సంస్థలతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైన నారా లోకేష్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఇందులో భాగంగానే లోకేష్ మాట్లాడుతూ ప్రజలు తమకు అద్భుతమైన విజయాన్ని అందించారని ఈ విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిపోయింది అంటూ తెలియజేశారు.అలాగే తాము కక్షలు సాధించే ప్రభుత్వం కాదా అంటూ అలాంటి ప్రభుత్వం నడిపే ఉద్దేశమే తమకు లేదంటూ కూడా తెలియజేశారు. ఇతర పార్టీ నేతలు చేసిన పొరపాట్లు తాము ఎప్పటికీ చేయమని వెల్లడించారు లోకేష్.. అలాగే మాది ఒకే రాజధాని సిద్ధాంతం అంటూ కూడా లోకేష్ వెల్లడించారు. రాష్ట్ర రాజధాని కేవలం అమరావతి అని కాకపోతే రాష్ట్రంలో అభివృద్ధి కేంద్రీకరణంగా కొనసాగుతుంది అంటూ లోకేష్ తెలియజేశారు.

రాష్ట్రంలో టిడిపి శ్రేణులు వేధించిన వాళ్లను తమ కుటుంబం పైన దుష్ప్రచారం చేసిన వాళ్లను కూడా చాలా కఠినంగానే శిక్షిస్తామంటూ కూడా లోకేష్ ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు గత ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారుల పైన పలు రకాల చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించారు.అలాగే తమ పార్టీని ఇంతటి విజయంతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ తెలియజేశారు నారా లోకేష్.. దాదాపుగా నారా లోకేష్ ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిచినట్లుగా కనిపిస్తోంది.. గతంలో ఓడిపోయిన తర్వాత ఈసారి మరింత స్పీడ్ తో మంగళగిరిలో గెలిచి చూపించారు.. మరి రాబోయే రోజుల్లో టిడిపి పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఎక్కువగా లోకేష్ ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు నేతలు సహకరిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: