నగరిలో ఊహించిన ఫలితమే వచ్చిందిగా.. ఇంత తేడాతో రోజా ఓటమిపాలయ్యారా?

Reddy P Rajasekhar

ఈ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా హ్యాట్రిక్ కు బ్రేకులు పడ్డట్టేనని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. 2014, 2019 సంవత్సరాలలో వైసీపీ తరపున పోటీ చేసిన రోజా జగన్ వేవ్ వల్ల సులువుగానే విజయం సాధించారు. అయితే గత ఐదేళ్లలో నగరి నియోజకవర్గంలో పరిస్థితులు మాత్రం పూర్తిస్థాయిలో మారిపోయాయి. రోజాపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే.
 
అదే సమయంలో వైసీపీ నేతలు, మంత్రులు, కార్యకర్తలు రోజాకు సహాయనిరాకరణ ప్రకటించడంతో పాటు కొంతమంది కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది. నగరి నియోజకవర్గంలో కూటమి తరపున టీడీపీ నుంచి గాలి భానుప్రకాశ్ పోటీ చేయడం జరిగింది. నగరి నియోజకవర్గం ఫలితం విషయంలో రోజాకు మాత్రం ఒకింత భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. నగరి ఫలితంతో రోజా రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది.
 
నగరి నియోజకవర్గంలో భారీ తేడాతో రోజా ఓటమి పాలవుతారని ప్రచారం జరగగా ఆ ప్రచారమే ఎట్టకేలకు నిజమైంది. నగరిలో రోజాను కచ్చితంగా ఓడించాలని అటు టీడీపీ నేతలు, ఇటు వైసీపీ నేతలు కసితో పని చేయగా ఆ కసికి తగ్గ ఫలితం అయితే దక్కిందనే చెప్పాలి. ఓటమిని ముందుగానే ఊహించిన రోజా ఫలితం విషయంలో పెద్దగా ఆశ్చర్యపోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
ఏపీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో రోజా భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. రోజా రాబోయే రోజుల్లో సినిమాలు, టీవీ షోలకు ప్రాధాన్యత ఇస్తారా లేక పొలిటికల్ కార్యక్రమాలకే పరిమితమవుతారా అనే చర్చ సైతం జరుగుతోంది. నగరి నియోజకవర్గంలో ఓటమి నుంచి కోలుకోవడానికి రోజాకు కొంత సమయం అయితే పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. నగరిలో హ్యాట్రిక్ సాధించాలన్న రోజా కల ఎట్టకేలకు నెరవేరలేదు. ఫైర్ బ్రాండ్ గా పేరును సొంతం చేసుకున్న రోజా రాజకీయాల్లో పార్టీ మారే అవకాశం కూడా లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: