విశాఖ: మాడుగులలో గెలిచి టీడీపీ జెండా పాతిన బండారు!

Purushottham Vinay
తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో మాడుగుల కూడా ఒకటి. ఇక్కడ 1983 నుండి 2004 దాకా టిడిపి ఓటమన్నదే ఎరగదు.వరుసగా ఐదుసార్లు (1983, 1985, 1989, 1994, 1999) గెలిచి మాడుగల ఎమ్మెల్యేగా పనిచేసారు రెడ్డి సత్యనారాయణ. ఆ తర్వాత 2009 లో గవిరెడ్డి రామానాయుడు టిడిపి నుండి పోటీచేసి విజయం సాధించారు. అలాగే మాడుగులలో వైసిపి కూడా బలంగానే వుంది.ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రెండు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే రెండుసార్లు కూడా వైసిపి ఘన విజయం సాధించి గెలిచింది. బూడి ముత్యాలనాయుడు 2014, 2019 ఎన్నికల్లో వైసిపి నుండి పోటీచేసి గెలిచి విజయం సాధించారు.మాడుగుల నియోజకవర్గ పరిధిలో చీడికాడ, దేవరపల్లి, కె. కోటపాడు, మాడుగుల మండలాలు ఉన్నాయి.


మాడుగుల అసెంబ్లీ ఓటర్ల విషయానికి వస్తే..ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 2,15,571 గా ఉంది. అందులో  పురుషులు - 1,04,981 ఉండగా మహిళలు - 1,10,584 ఉన్నారు.మాడుగుల అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులుగా సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఈసారి మాడుగులకు దూరమయ్యారు.ఇక ఆయనను అనకాపల్లి లోక్ సభకు షిప్ట్ చేసింది వైసిపి అధిష్టానం. దీంతో మాడుగుల అసెంబ్లీలో అనురాధ పోటీ చేశారు.తెలుగుదేశం పార్టీ  మాడుగుల బరిలో సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిని పోటీ అభ్యర్థిగా నిలిపింది. ఈ సీనియర్ నేతకి టీడీపీ మాడుగుల సీటు కేటాయించింది. కాగా బండారు సత్యనారాయణ మూర్తి 90092 (+ 27074) ఓట్లతో విజయం సాధించగా ఎర్లీ అనురాధ 63018 ( -27074) ఓట్లతో ఓడిపోవడం జరిగింది.మొత్తానికి ఇక్కడ వైసీపీ మీద టీడీపీ ఘన విజయం సాధించి గెలుపుని సొంతం చేసుకుంది.పోటీకి ముందు పార్టీలో కొంచెం డిస్టర్బన్స్ కి గురై మొత్తానికి తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత మాడుగులలో భారీ మెజారిటీతో గెలిచి తెలుగు దేశం జెండాని పాతేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: