నెల్లిమర్ల : వైసీపీ పార్టీ అభ్యర్థిపై భారీ మెజారిటీతో విజయం అందుకున్న జనసేన అభ్యర్థి..!

Pulgam Srinivas
ఈ రోజు ఉదయం నుండే ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఎంతో కట్టుదిట్టమైన చర్యల మధ్య జరుగుతున్న ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు సంబంధించిన అసెంబ్లీ స్థానాల ఫలితాలు వచ్చేసాయి. తాజాగా విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం వర్గానికి సంబంధించిన ఫలితాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసింది.

ఈ ప్రాంతం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా బి అప్పల నాయుడు బరిలో ఉండగా ... ఇక ఈ సారి ఎలక్షన్లలో తెలుగుదేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా బరిలోకి దిగిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ ప్రాంత సీటును జనసేన పార్టీ దక్కించుకుంది. ఇక జనసేన నుండి ఇక్కడ లోకం మాధవి బరిలో ఉంది. ఇక ఇక్కడే విజయాలను చూసుకున్నట్లు అయితే 2009 వ సంవత్సరం ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బద్దుకొండ అప్పలనాయుడు గెలుపొందారు.

ఆ తర్వాత 2014 వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పతివాడ నారాయణ స్వామి నాయుడు గెలుపొందారు. ఇక 2019 వ సంవత్సరం వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బి అప్పలనాయుడు గెలుపొందారు. ఇక 2019 వ సంవత్సరం గెలిచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న అప్పలనాయుడు కే జగన్ ఈ సారి కూడా సీటు ను ఇచ్చాడు. దానితోనే అర్థం అవుతుంది ఈయనకు ఈ ప్రాంతంలో ఎంత మంచి పట్టు ఉందో. జనసేన పార్టీ కేవలం 21 అసెంబ్లీ స్థానాలనే పొత్తులో భాగంగా తీసుకుంది.

అందులో చాలా చోట్ల ఈ పార్టీ సభ్యులు గెలిచే అవకాశం ఉంది అని మొదటి నుండి ఎంతో మంది చెబుతూ వస్తున్నారు. అలాగే టిడిపి , బిజెపి అనుకూల ఓట్లు కూడా వీరికి పడే అవకాశం ఉండడంతో లోకం మాధవి కి కూడా భారీగానే ఓట్లు పడే అవకాశం ఉంది అని ప్రజలు మొదటి నుండి అనుకుంటున్నారు. దానితో అప్పలనాయుడు మాధవి మధ్య గట్టి పోటు ఉండే అవకాశాలు ఉన్నాయి అని మొదటి నుండి ప్రజలు భావించారు. కానీ ఇక్కడ పెద్ద పోటీ ఏమీ నెలకొనలేదు జనసేన పార్టీ అభ్యర్థురాలు అయినటువంటి లోకం  మాధవి 108319 ఓట్లను తెచ్చుకొని గెలుపొందింది. ఇక వైసిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి అప్పలనాయుడు 69409 ఓట్లను సాధించాడు. దానితో అప్పలనాయుడు పై నాగ మాధవి 38910 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: