విజ‌య‌వాడ సెంట్ర‌ల్ : బొండా బెజ‌వాడ చ‌రిత్ర‌లో ఓ రికార్డ్ రాసి ప‌డేశాడు... చూస్కోండి..!

RAMAKRISHNA S.S.
2019 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినట్టే గెలిచి.. చివరలో గెలుపు ముంగిట బొక్క బోర్లా పడ్డారు.. అప్పటి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు. ఆంధ్రప్రదేశ్ లోని అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయి బొండా ఉమా రికార్డుల్లోకి ఎక్కారు. గత ఎన్నికలలో కచ్చితంగా గెలుస్తాడు అనుకున్న బోండా ఉమా.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతిలో కేవలం 24 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదీ పోస్టల్ బ్యాలెట్‌లలో విష్ణుకు.. ఉమా కంటే మెజార్టీ రావడంతో.. ఉమా ఓడిపోయారని చెప్పాలి. అయితే ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమాకు అన్ని సమీకరణలు చాలా బాగా కలిసి వచ్చాయి.

గత ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిపోయారన్న సానుభూతితో పాటు.. ఓడిపోయిన ఐదేళ్లు నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉండటం.. అటు వైసీపీ పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాసును సెంట్రల్ నియోజకవర్గానికి బదిలీ చేయటం.. ఎన్నికల ముందు వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గానికి రావడం.. ఇక్కడ పట్టు లేకపోవడం ఇక్కడ వైసీపీ క్యాడ‌ర్‌ పూర్తిగా వెల్లంపల్లికి సహకరించకపోవడం.. దీనికి తోడు నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఈసారి ఉమాకు వన్ సైడ్ గా సపోర్ట్ చేయటం.. జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటు బిజేపి క్యాడ‌ర్‌ తెలుగుదేశం కెడర్ అంతా కసితో పని చేయడంతో.. బొండా ఉమా ఈసారి కచ్చితంగా గెలుస్తాడు అన్న అంచనాలు ముందు నుంచే ఉన్నాయి.

ఇక ఏపీలోనే ఎక్క‌డా లేని విధంగా సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో భారీగా ఉన్న బ్రాహ్మ‌ణ వ‌ర్గం కూడా ఈ సారి త‌మ కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు సీటివ్వ‌క‌పోవ‌డంతో వైసీపీపై కోపంతో ఉన్నారు. ఇక ఈ రోజు కౌంటింగ్‌లో బొండా ఉమా దుమ్ము దులిపేసి వైసీపీకి పాత‌రేశాడు. ఉమాకు ఏకంగా 68 వేల భారీ మెజార్టీ ఘ‌న విజ‌యం సాధించారు. వాస్త‌వంగా చెప్పాలంటే విజ‌య‌వాడ చ‌రిత్ర‌లోనే ఇదో భారీ రికార్డ్‌గా చెప్పాలి. ఇక ఉమా రెండోసారి విజ‌యం సాధించ‌డంతో కాపు కోటాలో మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: