మంత్రాలయంలో మళ్లీ సత్తా చాటిన బాలనాగిరెడ్డి.. కూటమి వేవ్ లో కూడా తిరుగులేదుగా!

Reddy P Rajasekhar
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా బాలనాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన బాలనాగిరెడ్డి 2014, 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. గత ఎన్నికల్లో బాలనాగిరెడ్డి ఏకంగా 23,879 ఓట్లతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో మాత్రం టీడీపీ తిక్కారెడ్డికి బదులుగా రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చింది.
 
మంత్రాలయం నియోజకవర్గంలో గెలుపు కోసం అటు బాలనాగిరెడ్డి ఇటు రాఘవేంద్ర రెడ్డి ఎంతో కష్టపడ్డారు. ఒకరికొకరు ధీటుగా ప్రచారం చేసి మంత్రాలయం ఓటర్లను ఆకట్టుకున్నారు. తిక్కారెడ్డి వర్గం మొదట రాఘవేంద్ర రెడ్డికి సపోర్ట్ చేయకపోయినా కూటమి గెలవాలనే ఆలోచనతో ఆ వర్గానికి చెందిన కొంతమంది రాఘవేంద్ర రెడ్డికి సపోర్ట్ చేయడం జరిగింది. మంత్రాలయం నియోజకవర్గంలో గెలుపు కోసం అటు బాలనాగిరెడ్డి ఇటు రాఘవేంద్ర రెడ్డి తీవ్రంగా శ్రమించారు.
 
మంత్రాలయం నియోజకవర్గంలో బాలనాగిరెడ్డి 12843 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రికార్డ్ సృష్టించారు. వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాలనాగిరెడ్డి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. వైసీపీ నుంచి వరుసగా మూడుసార్లు పోటీ చేసి హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే కూడా బాలనాగిరెడ్డి కావడం గమనార్హం. బాలనాగిరెడ్డి గెలుపుతో మంత్రాలయంతో సంబరాలు అంబరాన్నంటాయి.
 
కూటమి టికెట్ రాఘవేంద్రరెడ్డికి కాకుండా తిక్కారెడ్డికి ఇచ్చి ఉంటే మాత్రం ఈ నియోజకవర్గంలో ఫలితం మరో విధంగా ఉండేదనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మంత్రాలయం అభివృద్ధి కోసం బాలనాగిరెడ్డి ఎంతో కష్టపడ్డారని అందుకే ప్రజలు మరోసారి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భారీ మెజార్టీతో గెలిచిన బాలనాగిరెడ్డికి వైసీపీ నేతలు అభినందనలు తెలుపుతున్నారు. మంత్రాలయంకు వచ్చే భక్తులకు సైతం ప్రయోజనం చేకూరేలా బాలనాగిరెడ్డి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానికంగా మంచి పేరు ఉండటం కూడా ఆయనకు కలిసొచ్చిందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: