కేసీఆర్ ను ఛీ కొట్టింది.. ఇప్పుడు కారును దెబ్బ కొట్టింది?

praveen
తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ కౌంటింగ్ ఉత్కంఠ ఇంకా ముగియలేదు. కానీ ఒక పార్టీ భవితవ్యం పై మాత్రం అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది . ఆ పార్టీ ఏదో కాదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర  కోసం పనిచేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అదేనండి టిఆర్ఎస్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తిరుగులేని  పార్టీగా ఎదిగింది. ఇప్పుడు ఆ బిఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా  మారింది. ఆ పార్టీ భవితవ్యం ఏంటి అంటే ఆ పార్టీ నేతలు కూడా ఏం చెప్పాలో తెలియక బిక్క ముఖం వేసే పరిస్థితి ఉంది.

 ఎందుకంటే ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష హోదాకి వచ్చినప్పటి నుంచి వరుసగా ఎదురు దెబ్బలు  తగులుతూనే ఉన్నాయి . ఏకంగా గులాబీ పార్టీలో కీలక పదవులను అనుభవించిన నేతలు అందరూ కూడా ఏకంగా కారు గుర్తుని వదిలి కాంగ్రెస్, బీజేపీ లో చేరారు.   అచ్చం ఇలాగే కారు పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న కడియం శ్రీహరి కూతురు ఏకంగా బిఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ కొట్టింది. ఏకంగా కడియం కావ్యకు వరంగల్ ఎంపీ సీటు ఇచ్చిన ఏకంగా.. ఆ ఎంపీ సీటును వద్దనుకొని మరి బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరింది.

 ఒక రకంగా గులాబీ దళపతి కేసీఆర్ను చీకొట్టినంత పని చేసింది. అలాంటి కడియం కావ్య కాంగ్రెస్ లో చేరి గెలుస్తుందా లేదా అని అందరూ అనుకుంటున్న వేళ.. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో ఘన విజయాన్ని అందుకుంది. బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ పై 2,05183 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. అయితే కడియం కావ్య పోటీ చేస్తున్న వరంగల్లో అటు బిఆర్ఎస్ పార్టీ నుంచి కనీస పోటీ లేకుండా పోయింది. అయితే బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ముందుగానే ఊహించిన కడియం కావ్య కాంగ్రెస్ లో చేరి మంచి పని చేశారు అంటూ ఇప్పుడు ఆమె విజయం తర్వాత అందరూ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: