విశాఖ - పెందుర్తి: ఫ్యాన్ రెక్కలు విరిచేసిన గాజు గ్లాస్?

Purushottham Vinay
విశాఖ - పెందుర్తి: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఇందులో భాగంగానే విశాఖ జిల్లాలో పలు సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది తెలుగుదేశం పార్టీ.ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి పెందుర్తి టికెట్ దక్కింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని కాదని మరీ ఈ సీటును జనసేన పార్టీకి కేటాయించింది టిడిపి. గతంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో పెందుర్తి కూడా ఒకటి. ఇలా పిఆర్పి నుండి గెలిచిన పంచకర్ల రమేష్ బాబు ఇప్పుడు జనసేన పార్టీ నుండి మరోసారి పోటీ చేస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని మండలాల విషయానికి వస్తే..పెదగంట్వాడ (కొంతభాగం), పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలు ఉన్నాయి.


పెందుర్తి అసెంబ్లీ ఓటర్ల విషయానికి వస్తే..నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 2,68,878 ఉండగా అందులో పురుషులు - 1,34,992, మహిళలు - 1,33,883 ఉన్నారు.పెందుర్తి అసెంబ్లీ ఎన్నికల 2024 అభ్యర్థుల విషయానికి వస్తే..వైసిపి అభ్యర్థి గా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి నుండి పోటీచేసి గెలిచిన అన్నంరెడ్డి అదీప్ రాజ్ కే ఈసారి కూడా వైసిపి అవకాశం ఇచ్చింది. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చినా కూడా ఎందుకో పెందుర్తిలో మాత్రం అదీప్ రాజ్ నే పోటీలో నిలిపింది వైసిపి అదిష్టానం. టీడీపీ కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా పెందుర్తి సీటు జనసేనకు దక్కింది. కూటమి అభ్యర్ధిగా జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు బరిలోకి దిగారు. ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీ నుండి ఇదే పెందుర్తిలో గెలిచారు. ఇక ప్రస్తుతం జరుగుతున్నా ఎన్నికల కౌంటింగ్ లో పంచకర్ల రమేష్ బాబు ఏకంగా 94826 (+ 52204) ఓట్లతో లీడింగ్ లో ఉండగా అన్నం రెడ్డి అదీప్ రాజ్ మాత్రం 42622 ( -52204) ఓట్లతో వెనకంజలో ఉన్నాడు. జనసేన పార్టీ వైసీపీ పై ఆదిక్యంలో దూసుకెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: