బీజేపీ కల చెదిరింది.. మళ్ళీ మజ్లీస్ జెండా ఎగిరింది?

praveen
తెలంగాణ రాష్ట్రం లో పట్టు సాధించాలని ఎన్నో రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బిజెపి. క్రమ క్రమంగా తమ సీట్ల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీతో పోటీగా సీట్లు గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా కీలకమైన స్థానాల లో విజయం సాధించింది. అది కూడా భారీ మెజారిటీ తో బిజెపి అభ్యర్థులు విజయ డంకా మోగించారు అని చెప్పాలి.

 ఇలా తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సాధించాలనే కల నెరవేరినప్పటికీ.. ఒక కల మాత్రం చివరికి అలాగే ఉండిపోయింది.  కాషాయం పార్టీకి ఒకచోట నిరాశే ఎదురయింది. హైదరాబాద్ నడిబొడ్డున కాషాయ జెండా ఎగరవేయాలని అనుకుంది కమలం పార్టీ. ఏ క్రమంలోనే ఏకంగా ఓటమి ఎరుగని పార్టీగా కొనసాగుతున్న ఎంఐఎం ను ఓడించేందుకు మాధవి లతను బరిలోకి దింపింది. అయితే మాధవిలత తనదైన ప్రచారంతో దూసుకుపోయే ఓటర్లను ఆకట్టుకున్నారు. బీజేపీ విజయం వరిస్తుందని.. ఓవైసీకి మొదటిసారి ఓటమి చవిచూస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మరోసారి హైదరాబాద్ ప్రజానీకం ఓవైసీకే పట్టం కట్టారు.

 ఇక మొదటి రౌండ్ నుంచి లీడ్ లో ఉంటూ వచ్చిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి మాధవి లత పై విజయం సాధించారు. ఏకంగా మూడు లక్షల 15,811 ఓట్ల ఆదిత్యంతో గెలుపొందారు. దీంతో హైదరాబాద్ నడిబొట్టున కాషాయ జెండా ఎగరవేయాలని కలలుగన్న బిజెపి పార్టీకి నిరాశ ఎదురైంది. కానీ ఓటమి ఎరుగని ఓవైసీకి మాధవి లత ఓటమి భయాన్ని కలిగించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా పార్టీలో ఊహించిన దాని కంటే మంచి మెజారిటీ సాధించినప్పటికీ హైదరాబాద్ స్థానంలో విజయం వరించకపోవడం మాత్రం బీజేపీకి ఒక వెలితిగా మిగిలిపోయింది. ఎంఐఎం పార్టీ తమ కంచుకోటను కాపాడుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: