కళ్యాణ్ దుర్గం: సురేంద్రబాబు చేతిలో గోరంగా ఓడిపోయిన తలారి రంగయ్య..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నువ్వా నేనా అంటూ అటు కూటమి, ఇటు వైసిపి పోటీ పడుతున్న విషయం తెలిసిందే.. ప్రత్యేకించి రాయలసీమలో కళ్యాణదుర్గం గురించి చెప్పుకోవాలి..  ఇక్కడ ఈ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉండగా ఓటర్లు ఎవరికి ఎక్కువ మొగ్గు చూపారనే విషయం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.. మరి ఏ పార్టీ తరఫున ఎవరు పోటీకి దిగారు?  ఎవరు గెలిచారు? ఎంత మెజారిటీతో గెలిచారు ? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి..
నిజానికి కల్యాణదుర్గం ఏ పార్టీకి అడ్డా కాదని చెప్పాలి..  ఒక్కో సారి ఎన్నికలు జరిగినప్పుడు ఒక్కొక్క పార్టీ అధికారంలోకి వస్తోంది..ఉదాహరణకు తీసుకున్నట్లయితే 2009ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఎన్ రఘువీరారెడ్డి పోటీ పడగా.. టిడిపి అభ్యర్థిగా హనుమంత చౌదరి బరి లోకి దిగారు.. అయితే ఇక్కడ కేవలం 3000 పైచిలుకు ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. రఘువీరారెడ్డి గెలుపొందారు. ఇక తర్వాత 2014లో టిడిపి తరఫున బోయ హనుమంత చౌదరి పోటీ పడగా.. వైఎస్సార్ సీపీ తరఫున తిప్పేస్వామి బరిలోకి దిగారు. అయితే ఇక్కడ ఏకంగా బోయ హనుమంతు చౌదరి 20 వేల పైచిలుక ఓట్లతో మెజారిటీ సొంతం చేసుకున్నారు

ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే వైఎస్ఆర్సిపి తరఫున ఉష శ్రీ చరణ్ పోటీ పడగా టిడిపి తరఫున మాదినేని ఉమామహేశ్వరరావు బరిలోకి దిగారు.  అయితే అనూహ్యంగా ఉషశ్రీ చరన్ ఏకంగా 20వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందింది . ఇక ఈ నేపథ్యంలోనే ఈసారి ఇక అలా ఈ మూడు సార్ల లోనే గమనిస్తే మనం ఒక్కొక్క పార్టీ ఒక్కసారి అధికారంలోకి వచ్చింది. అందుకే ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనే ఉత్కంఠ కళ్యాణదుర్గం ప్రజల్లో ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇక్కడ వైసిపి తరఫున తలారి రంగయ్య టిడిపి తరఫున అమిలినేని సురేంద్రబాబు పోటీ పడ్డారు.. ఇక చివరికి వెలువడిన ఎన్నికల ఫలితాలలో.. అమిలినేని సురేంద్రబాబు చేతిలో తలారి రంగయ్య 37011 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: