ఊరా మాస్ విక్టరీ అంటే ఇదే.. మొదటిసారి పోటీ.. అయినా ఇంత మెజారిటీనా?
రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటం ఖమ్మంలో ఎంపీ సీటు(MP Seat)ను గెలుచుకునేందుకు కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశంగా మారింది. అలాగే అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి వరంగల్ కి చెందిన మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు కావడం.. అంగ, అర్థ బలం రెండూ కలిగి ఉండటం.. దీనికి తోడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుంచి పూర్తిస్థాయి మద్దతు అందడం ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది.
ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ నుంచి రఘురామిరెడ్డి.. బిఆర్ఎస్ నుండి నామా నాగేశ్వరరావు.. బిజెపి నుండి తాండ్ర వినోద్ రావు పోటీలో నిలిచారు. అయితే ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ ఫలితాలను చూసుకుంటే.. వార్ వన్ సైడ్ అయింది అన్నట్లుగా అర్థమవుతుంది. తన వియ్యంకుడిని గెలిపించుకునేందుకు నడుము బిగించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుకున్నది సాధించినట్లుగానే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఏకంగా మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి 1,26,000 ఓట్ల ఆదిక్యంలో దూసుకుపోతున్నారు.
ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు అటు రఘురామిరెడ్డికి కనీస పోటీ ఇవ్వడం లేదు. ఎవరు కూడా దరిదాపుల్లో లేరు అని చెప్పాలి. ప్రతి రౌండ్లో రఘురామిరెడ్డి ఆదిక్యం అంతకందుకు పెరుగుతూ వస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆధిక్యం చూస్తుంటే ఖమ్మంలో వార్ వన్ సైడ్ అయిపోయింది. రఘురామిరెడ్డి ఊహించని భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అయిపోయింది అని అక్కడి ప్రజలందరూ ఫిక్స్ అయిపోతున్నారు. అయితే ఇలా ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన రఘురామిరెడ్డికి ఇంత భారీ మెజారిటీ రావడం అంటే మామూలు విషయం కాదని.. ఊర మాస్ విక్టరీ అంటే ఇదే అంటూ మాట్లాడుకుంటున్నారు అందరూ.