కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వంశీ

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కీలకమైన నేతలుగా ఉన్న వైసిపి నేతలలో కొడాలి నాని కూడా ఒకరు.. ఇక టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధిక్యతతో ఉన్నట్లుగా తెలుస్తోంది.. గుడివాడ నియోజకవర్గం చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు. ఈ నియోజక వర్గానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.ముఖ్యంగా గతంలో ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గం నాని అడ్డాగా మార్చుకున్నారు. టిడిపి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాని.. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి వీడి వైసిపి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు.
అలా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాని ఈసారి ఐదవ సారి పోటీ చేశారు. టిడిపి పార్టీ తరఫున ఎన్నారై వెనిగండ్ల రాము బరిలో దిగగా.. ఈయన కమ్మ సామాజిక వర్గము... ఈయన భార్య ఎస్సీ సామాజిక వర్గం కావడంతో ఇక్కడ రెండు సామాజిక వర్గపు ఓట్లు రాబట్టుకోవాలని టిడిపి పార్టీ వ్యూహాలు పడింది. అందుకు తగ్గట్టుగానే అక్కడ.. వెనిగండ్ల రాము దే పై చేయి అన్నట్లుగా తెలుస్తోంది.  అంతేకాకుండా వల్లభనేని వంశీ,  కొడాలి నాని కూడా ఫలితాల సమయం ఇంకా వెలవడక ముందే ఇంటి బాట పట్టినట్టుగా కనిపిస్తోంది. ఇక తాజాగా అందుతున్న విజువల్స్ ని బట్టి చూస్తే మనం రెండు రౌండ్లకే ఆధిక్యత కనిపించకపోవడంతో కొడాలి నాని, వంశీ ఇంటి బాట పట్టారు ఇక దీన్ని బట్టి చూస్తే వీరిద్దరూ ఓటమిని అంగీకరించినట్లే అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉండడం గమనార్హం..
ఇక తాజాగా అందుతున్న ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే కూటమి 56%  ఆధిక్యతో కనిపిస్తూ ఉండగా.. 41% సీట్లతో వైసిపి ఆదిక్యం కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికైతే ఇక్కడ టిడిపి గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి అయితే ఓటమిని అంగీకరించి కొడాలి నాని , వంశీ వెను తిరగడం అక్కడ టిడిపికి విజయ సంకేతంగా మారిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: