ఆళ్లగడ్డలో దూసుకుపోతున్న భూమా.. బిజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చి పడేస్తారా..??

Suma Kallamadi

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం ఆళ్లగడ్డలో రాజకీయాలు ఎప్పుడూ హాట్‌టాపిక్‌గానే ఉంటాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాక ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చింది. అంటే నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేరింది. ఈసారి ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి సెట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనతో టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ తలపడుతున్నారు.
2024 ఎలక్షన్ రిజల్ట్
మొదటి రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ  4789 (+ 378)కి ఓట్లు వచ్చాయి.
వైసీపీ నేత బిజేంద్రనాథ్ రెడ్డి 4411 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, శిరివెళ్ళ మండలాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,31,473. ఇక్కడ మొదటినుంచి రెడ్డి సామాజికవర్గ నేతలు గెలుస్తూ వస్తున్నారు. పార్టీ టీడీపీ అయినా, వైసీపీ అయినా ఆళ్లగడ్డ లో గెలిచేది మాత్రం రెడ్లే. 2019లో గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ టికెట్‌పై పోటీ చేసి 1,05,905 ఓట్లు గెలుచుకున్నాడు. 35,613 ఓట్ల తేడాతో భూమా అఖిలప్రియపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
గత కొంతకాలంగా ఈ నియోజకవర్గంలో గంగుల, భూమా కుటుంబ సభ్యుల ఒకరికొకరు తలపడుతూ వస్తున్నారు. 1962లో ఆళ్లగడ్డలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల నుంచి వేరే కుటుంబ సభ్యులు పోటీ చేశారు. ఇక ఆ తర్వాత 1967 ఎలక్షన్స్ నుంచి ఈ నియోజకవర్గంలో గంగుల ఫ్యామిలీ పోటీ చేస్తూ వస్తోంది. భూమా కుటుంబం ఒకటే గంగుల ఫ్యామిలీకి గట్టి పోటీని చెందే నా ఫ్యామిలీ మెంబర్స్‌ను ఓడించింది కూడా.
బిజేంద్రనాథ్ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి తనయుడు. ఈయన బీకాం చదువుకున్నారు.  2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటంతో తండ్రి భూమా నాగిరెడ్డితో కలిసి భూమా అఖిలప్రియ కూడా సైకిల్ పార్టీ కండువా కప్పుకున్నారు. భూమానాగిరెడ్డి చనిపోయాక అఖిల ప్రియ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈసారి ఆమె తండ్రికి కుడి భుజంగా ఉన్నటువంటి ఏవీ సుబ్బారెడ్డి దూరమయ్యారు, ఇది చాలదన్నట్టు ఆమె బ్రదర్ భూమా కిషోర్ రెడ్డి వైకాపాలో జాయిన్ అయ్యారు.  ఇవి రెండు ఆమెకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం వస్తున్న ఫలితాల ప్రకారం ఆమెకు ఈ మైనస్‌లు ఉన్నా గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: