పోస్టల్ బ్యాలెట్ : వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా..ఉద్యోగుల దాడి..?

FARMANULLA SHAIK
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు దాదాపు 2 గంటలకు పైనే పట్టొచ్చని తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌లో దాదాపు 4.61 లక్షల మంది ఓట్లు ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రతా ఉంది. కాగా 8 గంటల 30 నిమిషాల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి 30 నిమిషాలకు ఒక సారి ఫలితాలు వెల్లడి అవుతూ వస్తాయి.మొత్తం పోస్టల్ బ్యాలెట్ లో 60 శాతానికి పైగా ఓట్లు టీడీపీ కూటమి సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. రాజమండ్రి రూరల్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ అంచనాలు వెల్లడి అవుతున్నాయి. అయితే, ఈవీఎం కౌంటింగ్ ఒక్కో రౌండ్ అరగంట సమయం తీసుకొనే అవకాశం ఉంది. దాదాపు 25-30 స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. విజేత ఖరారులో ఈ సీట్ల ఫలితమే కీలకం కానుంది. దీంతో..ఫలితం పూర్తిగా వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని రెండు పార్టీలు తమ ఏజెంట్లను అప్రమత్తం చేసాయి.ముఖ్యంగా ఎంప్లాయిస్ అందరు టీడీపీకే పట్టం కట్టాలన్న ఉద్దేశంతో ఈసారి పోలింగ్ జరిగినట్లుగా స్పష్టంగా కనబడుతుంది.అలాగే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే తమ సమస్యలు తిరుతాయన్న ఆశ వారిలో కనబడింది. ఇక ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ అంటే ఉద్యోగస్తులు వేసిన ఓట్లను లెక్కించగా చాలావరకు టిడిపికే సలాం కొట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రకారం టిడిపి ముందంజలో కొనసాగుతోంది దానిపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం అందుతున్న ఫలితాల ప్రకారం టిడిపి 41 స్థానాలలో అధికంలో ఉండగా వైసిపి ఐదు స్థానాల్లో అధిక్యతలో ఉంది. పార్లమెంటు నియోజకవర్గంల స్థానానికి వస్తే టిడిపి ఐదు స్థానాల్లో లీడ్ లో, వైసీపీ రెండు స్థానాల్లో, బిజెపి రెండు స్థానాల్లో,  జనసేన ఖాతా తెరవనేలేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: