లోక్ సభ ఎలక్షన్ 2024 : నెల్లూరు పెద్దారెడ్డిగా నిలిచేది ఎవరు..?

murali krishna
దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ మొదలైంది.ప్రస్తుతం దేశ ప్రజలంతా ఎన్నికల ఫలితాల కోసం ఎంతగానో  ఎదురుచూస్తున్నారు.ఎన్నికల ఫలితాలపై ప్రధాన రాజకీయ పార్టీల అన్నిటి లో టెన్షన్ మొదలైంది. నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గం ఎవరి ఖాతా లో పడుతోందో అంటూ ప్రజలు ఎంతో  ఆసక్తిగా గమనిస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి పోటీ చేశారు.నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం ఇప్పుడు ఎంతో ప్రత్యేకత కలిగి వుంది.నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గం లో రెడ్డి వర్గం ఓట్లు ఎక్కువ గా ఉన్నాయి. 

అయితే టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఇద్దరూ కూడా  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం తో ఈసారి ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరం గా మారింది.ప్రస్తుతం ఈ నియోజకవర్గం లో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీలిపోనున్నట్లు తెలుస్తుంది.అయితే మిగిలిన సామాజిక వర్గం ఓటర్లు ఎవరిని ఆధరించారు అనేది ప్రశ్నగా మారింది. నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గం లో ఇద్దరు కూడా బలమైన నాయకులూ కావడం తో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలైంది.మరి కాసేపట్లో ఈవీఎం ఓట్లు కూడా లెక్కిస్తారు సాయంత్రాని కి ఎవరు ఈసారి గెలవబోతున్నారో పూర్తి క్లారిటీ వస్తుంది.ఎన్నికల ప్రచారం సమయం లో విజయసాయి రెడ్డి మైక్ తీసుకుని మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఉన్న ప్రజలు అందరూ వెనుతిరిగి వెళ్లిపోయారు. ఆ సందర్బంలో బహిరంగంగానే వెనక్కి రండి, మీటింగ్ అయిపోయిన తరువాత అందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అని మైక్ లో పదే పదే మొత్తుకున్నా ప్రజలు మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ఇళ్ల కు వెళ్లిపోయారు.దీనితో ఈసారి వైసీపీకి ప్రభావం తప్పేలా వుంది.మరి ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: