కౌం "ట్రిక్స్" : భద్రత లోపిస్తే కష్టమే..!

Divya
•సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత తప్పనిసరి
* లైఫ్ అండ్ డెత్ కాంపిటీషన్లో గొడవలు అధికం
* గెలిచేది ఎవరైనా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తప్పదా..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలలో అసెంబ్లీ , పార్లమెంటు స్థానాల ఎన్నికలు అత్యంత ప్రధానం అని చెప్పవచ్చు.. ప్రచారాలు, ఎన్నికల హడావిడి ఎలా ఉన్నా సరే ఫలితాల రోజున మాత్రం కచ్చితంగా అగ్గి జ్వాలలు వెలువడతాయనటంలో సందేహం లేదు.. ఎవరికి వారు అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తారు.. కానీ ఫలితాల రోజు మాత్రం ఏ చిన్న పొరపాటు జరిగిన సరే ఆ పొరపాటు విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా ఆ విధ్వంసం చివరికి గాలివానగా మారుతుంది అనడంలో సందేహం లేదు.ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏదో ఒక గొడవ ఎక్కడో ఒకచోట జరుగుతూ.. ఎంతో ఆస్తి నష్టం,  ప్రాణ నష్టం కలిగిస్తూ ఉంటాయి. సరిగా ఇప్పుడు కూడా అదే జరగబోతోంది.  ఇప్పటికే చాలామంది అధికారులు ప్రత్యేకించి ఎన్నికల ఫలితాల రోజున కొన్ని ప్రాంతాలలో భద్రత ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.
 ఇక ఆ భద్రత కనుక ఫెయిల్యూర్ అయితే మాత్రం ఆస్తి నష్టమే కాదు ప్రాణ నష్టం కూడా కలుగుతుంది.
వాస్తవానికి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.. గొడవలు, ఘర్షణలకు దిగితే ఉపేక్షించేది లేదు అంటూ ఎన్నికల ముందు పోలీస్ అధికారులు ఊదరగొడతారు.. ఎన్నికల బందోబస్తులో మాత్రం వైఫల్యాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి.. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలలో ఎక్కువగా ఈ సంఘటనలు జరిగినట్లు మనం పలు వీడియోల ద్వారా ఇప్పటికే చూసాం.. ఇక్కడ సరైన భద్రత లేకపోవడం వల్లే ఇలాంటి ఘర్షణలకు తావు ఇచ్చినట్లు అయింది.. ప్రత్యేకించి ఈ 2024 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు రెండు పార్టీలకు లైఫ్ అండ్ డెత్ గా మారిపోయాయి.
ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా ఇలాంటి సమయంలో ఏ చిన్న గొడవ జరిగినా సరే అది విధ్వంసానికి దారి తీసేటట్టు కనిపిస్తోంది అందుకే ఫలితాల రోజు కూడా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తే మాత్రం ముప్పు తప్పదు.
ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెళ్లడయ్యే నేపథ్యంలో ఘర్షణలు , కొట్లాటలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..  ఆగ్రహం కట్టలు తెంచుకొని తోటి వారిపై దాడి చేసే స్థాయికి దిగజారి పోతారు.. ఫలితంగా ప్రాణ నష్టాలు ఎక్కువ అవుతాయి.. అందుకే ప్రత్యేకించి గొడవలు జరిగే నియోజకవర్గాలలో పోలీసు భద్రత కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది.. ఇక ఈసారి కైకలూరు, భీమవరం, దెందులూరు ,తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు, నూజివీడు, పల్నాడు , తాడిపత్రి వంటి ప్రత్యేక ప్రాంతాలలో గొడవలు జరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి.. పోలింగ్ సమయంలో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లోనే పునరావృతమయ్యే ఆస్కారం కూడా ఉంది.. ప్రత్యేకించి కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాలలో బందోబస్తు కట్టుదిట్టంగా ఉండాలని పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఇక సంబరాలకు ర్యాలీలకు అనుమతి లేదని.. విచ్చలవిడిగా గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈసీ అధికారులు చొరవ తీసుకొని ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం చేయాలని.. లేకపోతే అన్ని నష్టాలే జరుగుతాయని చెప్పవచ్చు. మరి ఫలితాల రోజున గొడవలు,  సంఘర్షణలు జరగకుండా పోలీస్ బలగాల భద్రత ఏ మేరకు చక్కగా పనిచేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: