కౌం ' ట్రిక్స్ ' : ఈవీఎంల ట్యాంపరింగ్ నిజమేనా.. చూస్కోపోతే మోసాలే..?
- ఒక్కో కంట్రోల్ యూనిట్‌లో 15 యేళ్ల పాటు లైవ్‌లోనే చిప్‌లు
- పార్టీల అభిమానులు అధికారులైతే ఏజెంట్లకు హెల్ఫ్..!
( విశాఖపట్నం - ఇండియా హెరాల్డ్ )
మరి కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక, ఇదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. అయితే.. దేశవ్యాప్తంగా ఇప్పుడు పెను కలకలం రేగింది. దీనికి కారణం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారన్న అనుమానం. ఇదే వ్యవహారం ఏపీలోనూ తలెత్తింది. మరి ఇది నిజమేనా? అంటే.. కొన్ని సందేహాలు ఉన్నాయి.
+ ఈవీఎంల కంట్రోల్ యూనిట్లను మార్చే అవకాశం ఉంది(గతంలో బిహార్ లోని ఓపోలింగ్ బూత్‌లో మార్చారని విమర్శలు వచ్చాయి). ఇదే జరిగితే.. తాజాగా జరిగిన కంట్రోల్ యూనిట్ల స్థానంలో పాతవి పెట్టి లెక్కించే అవకాశం ఉంది. ఎన్నిక లసంఘం లెక్కల ప్రకారం.. ఒక్కొక్క కంట్రోల్ యూనిట్‌లో 15 సంవత్సరాల వరకు చిప్‌లు లైవ్‌లో ఉంటాయి. వీటిని మార్చకపోతే.. ఆ ఓట్లు అలానే ఉంటాయి. ఈ అనుమానం కూడా పార్టీలకు ఉంది.
+ ఇలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు.. ఈవీఎంల కంట్రోల్ యూనిట్లపై తేదీ, సమయం రాయాలనే డిమాండ్ ఉంది. కొన్ని చోట్ల పాటిస్తున్నారు. కొన్ని చోట్ల పాటించడం లేదు. ఇదే జాతీయస్తాయిలో ఇప్పుడు వివాదంగా మారింది.
+ మరో ముఖ్యమైన విషయం ఒక ఈవీఎం కంట్రోల్ యూనిట్‌ను.. ఒక చోట నుంచి ఒకచోటకు తీసుకువచ్చే క్రమంలో మార్చేందుకు అవకాశం ఉంది. ఉదాహరణకు పిఠాపురంలో పోలైన ఓట్లను జిల్లా కేంద్రంలో లెక్కించారని అనుకుందాం. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి తీసుకువచ్చే క్రమంలో దీనిని వేరే నియోజకవర్గానికి తీసుకువెళ్తే.. అక్కడ పోలైన ఓట్లుగానే పరిగణిస్తారు. ఎందుకంటే.. ఈవీఎంలలో ఎక్కడి ఓట్లు అనేది నిర్దేశించే పరిస్థితి లేదు. చేతి రాతతో ఉన్న స్లిప్పులను మాత్రమే వాటిపై అంటిస్తారు. అన్నీ ఓకే చోట ఉంచినప్పుడు.. ఈ స్లిప్పులను కూడా మార్చేస్తే.. ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా.. పార్టీలకు అభ్యర్థులకు సెగ పెట్టిస్తుంది.
+ ఈవీఎంలలో ఓట్ల లెక్కించే సమయంలో అధికారులు నిబంధనలు పాటించడం లేదన్న వాదన కూడా ఉంది. అంటే.. బలమైన పార్టీలకు చెందిన అనుకూల అధికారులు ఉంటే.. వారి ఏజెంట్ల కు అనుకూలంగా ఉంటారు. దీంతో ఈవీఎంల లెక్కింపులో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఈ విషయంపైనే టీడీపీ అధినేత చంద్రబాబు ఏజెంట్లను హెచ్చరించారు. వైసీపీ ఇక్కడే అక్రమాలకు పాల్పడుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.