బాబు స్కెచ్‌ : గెలవబోయే వైసీపీ ఎమ్మెల్యేల టచ్‌ లోకి టీడీపీ ?

frame బాబు స్కెచ్‌ : గెలవబోయే వైసీపీ ఎమ్మెల్యేల టచ్‌ లోకి టీడీపీ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్  ఫలితాలు శనివారం రోజున రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏపీ ప్రజలను గందరగోళ పరిస్థితికి నెట్టాయి. అసలు ఏ పార్టీ గెలుస్తుందో అని... ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... కొన్ని వైసీపీకి అనుకూలంగా వచ్చాయి.

 
ఇక జాతీయ మీడియా సంస్థలు, ఇతర సర్వే సంస్థలు మాత్రం... తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏపీలో వైసీపీకి 50%, తెలుగుదేశం కూటమికి 50% రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటి నేపథ్యంలో...  ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు... కొత్త స్కెచ్ తెరపైకి తీసుకువచ్చారట.

 
 వైసిపి  పార్టీలో కచ్చితంగా గెలిచే ఒక 25  మంది ఎమ్మెల్యేల  టచ్ లోకి నారా చంద్రబాబు నాయుడు వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ... కొంతమంది ఇలా ప్రచారం చేస్తున్నారు. ఆరా మస్తాన్ సర్వే సంస్థ చెప్పినట్టు... తెలుగుదేశం కూటమికి 77 నుంచి 80 మధ్య  సీట్లు వస్తే...  అప్పుడు వైసిపి ఎమ్మెల్యేల అవసరం వస్తుంది.


 అందుకే ఇప్పటినుంచే చంద్రబాబు నాయుడు తన రెండవ స్కెచ్ రెడీ చేసుకున్నారట. అదే వైసిపి అధిష్టానం మాత్రం ఈ తరహాలో ఆలోచించడం లేదని సమాచారం. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం... ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు.. ఈ కొత్త తరహా ప్లాన్ అప్లై చేస్తున్నారని వార్తలు  వస్తున్నాయి.  ఏపీలో చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి కొత్త అభ్యర్థులను పెట్టారు. ఇలాంటి అభ్యర్థులను మాత్రమే చంద్రబాబు నాయుడు టచ్ చేస్తున్నారట.

 
 అంతేకాకుండా వైసిపి పార్టీలో  గత ఐదు సంవత్సరాల నుంచి  కొంతమేర అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను, అవమానాలకు గురైన ఎమ్మెల్యేలను  కూడా  కాంటాక్ట్ అవుతున్నారట చంద్రబాబు నాయుడు. అయితే ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత.. తెలుగుదేశం పార్టీకి  70 కి పైగా స్థానాలు వస్తే...  ఈ ప్లాన్ అమలు చేయాలని.. ఇప్పటినుంచి చంద్రబాబు నాయుడు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట. దీని వెనుక బిజెపి పార్టీ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు కానీ... ఏపీ రాజకీయాలను మాత్రం ఈ వార్త కుదిపేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: