తెలంగాణ మంత్రి : ఏపీలో అతనే ముఖ్యమంత్రి..ఇదే శాసనం ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై... అందరూ ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో... శనివారం రోజున ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో... జాతీయ లోకల్ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ ఫలితాలను రిలీజ్ చేశాయి. అయితే ఈ ఎగ్జిట్ ఫలితాలలో మెజారిటీ సర్వే సంస్థలు.... జగన్మోహన్ రెడ్డికి ఎడ్జ్ ఇచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నట్లు...  చాలా సంస్థలు తమ రిపోర్టును వెల్లడించాయి. ఆరా లాంటి సర్వే సంస్థలు ఎన్నో... జగన్మోహన్ రెడ్డికి వంద సీట్లకు పైగా వస్తాయని తేల్చి చెప్పాయి. కొన్ని అయితే తెలుగుదేశం పార్టీకి 20 లోపు  సీట్లు వస్తాయని వెల్లడించాయి. వైసిపి పార్టీకి 49.4 ఓటింగ్ శాతం వస్తుందని... తెలుగుదేశం కూటమికి 47.5 ఓటింగ్ శాతం వస్తుందని పేర్కొన్నాయి పలు సర్వే సంస్థలు.

అంటే దాదాపుగా రెండు శాతం ఓట్ల తేడాతో...  జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏపీలో మరోసారి విజయం సాధించబోతుందన్నమాట. ఇలాంటి నేపథ్యంలో...  తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని దానిపై క్లారిటీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

తనకు వచ్చిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తన స్నేహితులు, బంధువులు, ఇతరులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏపీలో జగన్మోహన్ రెడ్డి... సర్కార్ ఏర్పాటు కావడం ఖాయమన్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నట్లు తన సన్నిహితులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారట. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా తాము... కలిసిమెలిసి ఉంటామని... ఎలాంటి గొడవలు లేకుండా ముందుకు సాగుతామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: