పీపుల్స్ పల్స్ : జనసేన కి ఏకంగా అన్ని సీట్లు..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తూ ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో రెమ్యూనిరేషన్ తీసుకుంటూ తెలుగు లో తిరుగులేని హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. ఇక పార్టీని స్థాపించిన తర్వాత మొదటి సారి వచ్చిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఈ పార్టీ పార్టిసిపేట్ చేయలేదు. 2019 వ సంవత్సరం ఈ పార్టీ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో బరిలోకి దిగింది.

జనసేన పార్టీ కనీసంలో కనీసం 10  , 20 సీట్లు అయినా దక్కించుకుంటుంది. అలాగే ఈ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ అయిన గెలుస్తాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఇవేమీ జరగలేదు. ఈ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాలలో పోటీ చేస్తే రెండిట్లో ఓడిపోయాడు. అలాగే ఈ పార్టీలోని ఒకే ఒక వ్యక్తి గెలుపొందాడు.

ఇలా 2019 వ సంవత్సరం అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో ఈ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఇకపోతే ఈ సారి మాత్రం జనసేన అధినేత పవన్ ఆచితూచి అడుగులు ముందుకు వేశాడు. దానితో పోయినసారితో పోలిస్తే అద్భుతమైన డెవలప్మెంట్ ను కనబరిచినట్లు తెలుస్తుంది. ఇక ఈ సారి జనసేన ఒంటరిగా కాకుండా టిడిపి , బిజెపి లతో కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగింది. ఈ సారి ఈ పార్టీ తక్కువ స్థానాలలో పోటీ చేసినప్పటికీ అందులో దాదాపుగా చాలా వరకు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వేను విడుదల చేసింది.

అందులో భాగంగా ఈ సంస్థ వారు జనసేన పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికలలో 14 నుండి 20 సీట్లను కైవసం చేసుకోబోతుంది అని అంచనా వేసింది. ఈ సంస్థ అంచనే కనుక నిజం అయినట్లు అయితే జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మరో అద్భుతమైన పార్టీగా ఎదిగే అవకాశాలు ఉన్నట్లే అవుతుంది. మరి జనసేన పార్టీ ఎన్ని సీట్లను కైవసం చేసుకుంటుందో తెలియాలి అంటే జూన్ 4 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: