కౌంటింగ్ కి ముందే డిసైడ్ అయిన ఏపీ రాజధాని.. ఎక్కడంటే..!

lakhmi saranya
ఏపీ రాజధాని ఏది అని ఎవరిని అడిగినా ఘోరంగా మండిపడుతున్నారు. ముఖం చిక్లింపులు దర్శనమిస్తున్నాయి. మరికొందరు అయితే మూడు రాజధానులు.. మూడు రాజధానులు అంటూ వ్యంగ్యాస్త్రాలు ‌ సంధిస్తున్నారు. మేధావుల నుంచి విద్యార్థుల వరకు కూడా రాజధాని విషయంపై ఆవేదనలో ఉన్నారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే పూర్తిగా తాము మునిగిపోయామని వెల్లడిస్తున్నారు. వాస్తవానికి 2014లో రాష్ట్ర విభజన ‌ గురించి తరువాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను పదేళ్లపాటు కొనసాగించారు.
దీనికి మూడు జూన్ 2 తోనే ‌ కాలం తీరనుంది. మరోవైపు 2017 లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మించి తలపెట్టిన నవ నగరాల తో కూడిన రాజధానిగా అమరావతి వినూతికెక్కింది. ‌ అనేక మంది హర్షించారు. అనేక మంది పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వచ్చారు. ప్రధాని మోడీ సాక్షిస్తూ.. తమ చేతుల మీదగా శంకుస్థాపన చేశారు. మొత్తానికి దేశంలోనే అతిపెద్ద నగరంగా.. ఏపీకి  తలమనికంగా.. అమరావతి ఏర్పడాల్సి ఉంది. ఆ దిశగా టిడిపి హయామంలో కసరత్తు కూడా జరిగింది.
అయితే వైసిపి వచ్చిన తరువాత మొత్తంగా అటకెక్కింది. మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చారు. అంతేకాకుండా రైతులకు కూడా చుక్కలు చూపించారు. అమరావతిని మొత్తానికి ఒక సుప్త చేతన వస్థ లో ఉంచారు. మరి ఏపీకి ఇప్పటివరకు ఉన్న హైదరాబాద్ పోయింది. మరోవైపు అమరావతి లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ తాను అధికారంలోకి వస్తే.. ఆది నుంచి ఆయన చెబుతున్న విశాఖను రాజధాని చేస్తానని తెలిపారు. మేనిఫెస్టోలో కూడా చేర్చారు. ఇక తాను సీఎంగా విశాఖ నుంచే ప్రధాన స్వీకారం చేస్తానని అన్నారు.
ఇక ఇంకో వైపు టిడిపి అధినేత చంద్రబాబు నుంచి కూటమి పార్టీ జనసేన అభ్యర్థుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అమరావతి నే రాజధాని చేస్తామన్నారు. తాము రాగానే పరుగులు పెట్టిస్తామని.. రైతులకి కూడా మేలు చేస్తామని హామీ ఇచ్చారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఏపీకి రాజధాని ఏది? అంటే.. ఈవీఎంలలో ‌ నిక్షిప్తం అయిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. అటు అధికార పక్షం ఇటు ప్రత్యక్ష కూటమి కూడా రాజధానిపై క్లారిటీ ఇచ్చాయి. ఎవరు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో తేల్చి చెప్పాయి. దీంతో ప్రజలు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అదేంటనేది మాత్రం జూన్ 4న తెలియబోతుంది. రాజధాని ఏదో అప్పుడే డిసైడ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: