ఇంకా రిజల్ట్ రానే లేదు.. బాబు అన్ని రెడీ చేసుకుంటున్నాడుగా?

praveen
ఆంధ్రాలో ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోబోయేది ఎవరు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చ జరుగుతుంది. మునుపెన్నడూ లేనివిధంగా.  ఈసారి భారీగా పోలింగ్ శాతం నమోదయింది. అయితే ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవరిని గెలిపించబోతుంది. ఎవరికి మెజారిటీ అందించబోతుంది అనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే మే 13వ తేదీన జరిగిన పోలింగ్ కు సంబంధించిన కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరగబోతుంది  అయితే కౌంటింగ్ కి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఇక ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది.

 ఏం జరగబోతుందో అనే విషయం అందరిలో కూడా టెన్షన్ నెలకొంది. ఇలాంటి సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు సైలెంట్ గా తన పని తాను కాని చేసేస్తున్నారు అనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే భారీ మెజారిటీతో అటు ఏపీలో అధికారాన్ని చేపట్టబోతున్నాం అనే ధీమాతో ఉన్న చంద్రబాబు.. ఇక ప్రమాణస్వీకారం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఆరు నూరైనా నూరు ఆరైనా అధికారం తమదే అని బాబు భావిస్తున్నారట. అయితే బిజెపి జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ. సోలో గానే టీడీపీకి మెజారిటీ రావచ్చు అన్నది చంద్రబాబు ధీమాతో ఉన్నారట.

 ఏపీలో వార్ వన్ సైడ్ అయిపోయిందని బలంగా నమ్ముతున్నారట. సీఎంగా ప్రమాణస్వీకారానికి ప్రిపరేషన్స్ అన్ని చేసుకుంటున్నారట. తన తొలి ప్రసంగం ఏం ఇవ్వాలి అనే విషయాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు అని తెలుస్తుంది. అయితే ప్రమాణస్వీకారానికి అతిధులుగా ఎవరిని పిలవాలి అనే విషయంపై కూడా లిస్టు రెడీ చేసుకుంటున్నారట. బిజెపి పెద్దలైన మోడీ లేకపోతే అమిత్ షాను పిలవాలని అనుకుంటున్నారట. ఇక జూన్ 9వ తేదీన మంచి ముహూర్తం ఉందని.. ఇప్పటికే చంద్రబాబుకు పండితులు కూడా సూచించారట. బాబు నిర్మించిన రాజధాని అయిన అమరావతిలోనే ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరగబోతుందట. ప్రమాణ స్వీకారం సమయంలోనే కీలక నేతలకు కొన్ని బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో కూడా ఉన్నారట చంద్రబాబు. ఇక బాబు కాన్ఫిడెన్స్ చూసి తెలుగు తమ్ముళ్లు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: