బాబుకు - జగన్, జగన్కు - షర్మిల.. దెబ్బ అదుర్స్..!

lakhmi saranya
పాలిటిక్స్ అయినా సినిమాలు అయినా.. తల తన్నేవాడు ఒకడు ఉంటే.. తాడిని తన్నేవాడు మరొకడు ఉంటాడు. ఏపీలో జరిగిన పోలింగ్ సంగతి ఎలా ఉన్నా.. దీనికి ముందు జరిగిన రాజకీయాలను గమనిస్తే.. ఆసక్తికర విషయం ఒకటి అర్థమవుతుంది. టిడిపి అధినేత చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గం కుప్పం లో ఓడించాలని కంకణం కట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. అనేక రూపాల్లో విన్యాసాలు చేపడుతున్నారు. కుప్పం లో దాదాపు నలుగురు నుంచి ఆరుగురు వరకు కీలక నేతలను మోహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ.. సంక్షేమం అందించారు. రోడ్డు నుంచి బడి వరకు బాగు చేశారు. పక్కనే ఉన్న నియోజకవర్గాలను పట్టించుకోని ప్రభుత్వం కుప్పం నియోజకవర్గాన్ని మాత్రం అద్దం లాగా తీర్చిదిద్దారు.

ఇక కుప్పం లోను కీలక రాజకీయ నేతలను వైసీపీలోకి తీసుకున్నారు. చంద్రబాబుకు జై కొట్టే బ్యాచ్ ను అది రించారు.. బెదిరించారు.. తమ వైపు తిప్పుకున్నారు. ఇక మొత్తం గా చూస్తే కుప్పం పై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టేలాగా.. ఏటా ఆరుసార్లు వెళ్లి.. తన పరివారాన్ని కాపాడుకునేలా చేశారు. అంతేకాకుండా కుప్పానికి ప్రత్యేక మేనిఫెస్టో  ఇచ్చే పరిస్థితిని.. నారా, నందమూరి కుటుంబాలు కూడా.. ఇక్కడ ప్రజలను ఓట్లు అడిగే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇక ఇది  నాణేనికి ఒకవైపు. చంద్రబాబును ఇరుకున పడేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఇదే సమయంలో తాను కూడా ఇరుక్కుపోయాడు. ఆయనకు కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిల నుంచి సెగ తగిలింది. కంచుకోట కడపలో జగన్కు దిమ్మ తిరిగేలాగా ప్రచారం చేపట్టింది.

కీలకమైన ఓట్లను కదిలించేస్తున్నారన్న వాదన కూడా వినిపించింది. ఇక అంతా బాగుందని అనుకుంటే.. మొత్తానికి చాప చుట్టేయడం కాయం అన్న అంచనాలు కూడా వైసీపీలో జోరుగా వినిపించాయి. ఎక్కడైతే అభ్యర్థితో చంద్రబాబును ఓడించాలని జగన్ ప్లాన్ వేశాడో.. ఎలాంటి అభ్యర్థి లేకుండా.. కేవలం సెంటిమెంట్లతోనే.. జగన్ను ఓడించాలని షర్మిల వేసిన స్కెచ్ అదుర్స్ అనేలాగా ఉంది. కేవలం రెండు మాసాల్లోనే వైసిపి అధినేతకు పట్ట పగలే చుక్కలు చూపించింది షర్మిల. దీంతో ఎన్నడూ లేని విధంగా కడప చుట్టూ జగన్ ప్రదక్షిణాలు  చాల్సి వచ్చింది. పదే పదే జిల్లాల్లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది.  ఇక ఈ పరిణామాలు గమనించిన వారు బాబుకు చుక్కలు చూపించాలని అనుకున్న జగన్ కి షర్మిల గట్టిదబ్బే వేసిందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: