గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్.. పట్టు లేని పార్టీకే పట్టమా?

praveen
మే 13వ తేదీన తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకి ఎన్నిక జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అంతకు ముందు వరకు కూడా ప్రచార హోరుతో దూసుకుపోయిన అభ్యర్థుల భవితవ్యం ఏంటి అన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు తేల్చేశారు. అయితే ఇక ఈ ఎలక్షన్స్ లో ప్రధాన పోటీదారుడుగా ఉన్న బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీలు తమకే ఆధిక్యం రాబోతుంది అంటూ ధీమాతో ఉన్నారు.

 అయితే ప్రజలు ఏం తీర్పును ఇచ్చారు అన్న విషయం మాత్రం అటు జూన్ 4వ తేదీన విడుదల కాబోయే ఫలితాలలో తెలియబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు తెలంగాణలోని రాజకీయ సమీకరణలను సేకరించి ఇక ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎక్కువ మెజారిటీ సాధించబోయే పార్టీ ఏది అనే విషయాన్ని ముందుగానే ఒక అంచనాకు వస్తున్నారూ. ఈ క్రమంలోనే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలందరూ ఇక రాష్ట్రంలో పట్టులేని పార్టీకే పట్టం కట్టబోతున్నారు అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

 అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెజారిటీ స్థానాలలో గెలవాలని ఇక ప్రతిపక్ష హోదాలోకి వచ్చి బంగపడిన బిఆర్ఎస్ సత్తా చాటాలని అనుకున్న అటు బిజెపి పార్టీ వైపే తెలంగాణ ప్రజలను నిలిచారు అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వమే వస్తుందని బలంగా నమ్మడం.. ఇక లోకల్ పార్టీల ఎంపీలను గెలిపిస్తే కేంద్రంతో వివాదాలు పెట్టుకోవడం ద్వారా ఇక అభివృద్ధి జరగదు అని ముందే అంచనా వేయడం.. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంటుంది కాబట్టి ఇక ఆ పార్టీ ఎంపీలను గెలిపిస్తే అభివృద్ధికి నిధులను  సులభంగా తీసుకురావడం.. ఇక సమస్యలను ఎంతో ఈజీగా పరిష్కరించడం చేస్తారని తెలంగాణ ప్రజలు నమ్మారట.  మరోవైపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో గులాబీ పార్టీకి బలహీనమైన అభ్యర్థులు ఉన్నచోట ఆ పార్టీ నేతలందరూ కారు పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ కు కాకుండా బిజెపికి ఓటు చేయాలని కోరారట.  ఇలా అన్ని సమీకరణాలు కలుపుకొని ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ నుంచి బిజెపి డబుల్ డిజిట్ స్థానాలలో విజయం సాధిస్తుందన్నది విశ్లేషకుల అంచనా. మరేం జరుగుతుందన్నది జూన్ నాలుగున జరగబోయే కౌంటింగ్ లో తేలబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: