కూటమితో పోలిస్తే వైసీపీ అభ్యర్థులు బెటర్.. ఎందుకంటే?

Purushottham Vinay
కూటమితో పోలిస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బెటర్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో వారు చాలా వేగంగా దూసుకుపోయారు. గడపగడపకు వైసీపీ ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించడం, జగనన్న సురక్ష, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలతో ఐదేళ్ల నుంచి జనం మధ్యనే ఉండటం ప్రచారంలో వైసీపీ అభ్యర్థులను ప్రజలకు మరింత చేరువ చేసింది. ఆయా గ్రామాలు, వార్డులకు వెళ్లినప్పుడు స్థానికులను గౌరవంతో పేర్లు పెట్టి పిలుస్తూ, వారి సమస్యలు పరిష్కరించామని చెబుతూ, ఐదేళ్ల ప్రగతిని వివరిస్తూ, చేపట్టబోయే పనులను తెలుపుతూ వైసీపీ అభ్యర్థులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులకు అపూర్వ స్పందన అనేది లభించింది.వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా వైసీపీ మేనిఫెస్టో ఉంటే టీడీపీ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదిగా ఉందని చాలా మంది ప్రజలు పెదవి విరిచారు. గత అనుభవాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు హామీలను వారు విశ్వసించలేదు.


కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిన రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభ్యర్థులు అండగా నిలిచిన తీరును ప్రజలు గుర్తు చేసుకున్నారు. కూటమి అభ్యర్థులు, మూడు పార్టీల అధినేతలు అప్పుడేమయ్యారని ప్రజలు నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన మొదటి సారిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ కూడా తుస్సుమంది. ఇంకా సభా ప్రాంగణంలో సగానికి పైగా ఖాళీగానే కనిపించింది. ఆ తర్వాత నరసాపురం, పాలకొల్లు. తణుకు, తాడేపల్లిగూడెం ఇంకా ఉండి వంటి నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రచార సభలకు జనం రాక అవి వెలవెలబోయాయి. వారు ప్రసంగిస్తున్న సమయంలోనే జనాలు వెనుదిరిగి వెళ్లిపోవడం కనిపించింది.జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి జనం ప్రభంజనంలా తరలిరావడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్‌ జోష్ ని నింపింది. ఉండి, భీమవరం, తాడేపల్లిగూడెం ఇంకా తణుకు నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సుయాత్రకు దారిపొడవునా బారులు తీరి జననేతకు జనాలు బ్రహ్మరథం పట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: