పిన్నెల్లి బ్రదర్స్ బతుకు బస్టాండే.. మరో మరో పెద్ద కేసు పడిందిగా..?

Suma Kallamadi
వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా పెద్ద వివాదంలో చిక్కుకుపోయారు. ఆయన పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ వద్ద EVM, VVPAT మెషిన్లను నేలకేసి బాది వాటిని ధ్వంసం చేశారు. ఈ చర్యను చాలా తీవ్రంగా పరిగణిస్తూ అతనిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుంది.
పిన్నెల్లి ఈవీఎం, వీవీప్యాట్‌లను పాడు చేసే సమయంలో తాను జోక్యం చేసుకున్నానని టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు తాజాగా ఆరోపణలు చేశారు. అలా జోక్యం చేసుకుంటున్న సమయంలో తనను చంపేస్తానంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి కామెంట్లు చేశారని ఆరోపించారు అంతేకాదు, హత్యాయత్నం కేసు పెట్టారు. ఇదంతా నిన్నటి సంగతి తాజాగా మరొక పెద్ద కేసు పిన్నెల్లి బ్రదర్స్ పై పడింది. కారంపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నారాయణ స్వామిపై రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డిలు దాడి చేశారట. అతన్ని చంపేటట్లు చేశారట. అందుకే వీరిపై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. ఒక పోలీసులను చంపడానికి ప్రయత్నించారు అని ఆరోపణలు రావడం చాలా పెద్ద సీరియస్ విషయం అవుతుంది.
టీడీపీ నేతలపై పిన్నెల్లి సోదరులు దాడి చేస్తుండగా సీఐ నారాయణ స్వామి జోక్యం వేసుకున్నారట ఆ సమయంలో సీఐపై కూడా రాళ్లతో దాడి చేశారని ఆరోపణలు చేశారు. తొలత, 10 మంది పిన్నెల్లి అనుచరులపై ఫిర్యాదు దాఖలైంది. ఈ కేసుపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తు జరిపింది. అయితే వారు సీఐ నుంచి వాంగ్మూలం తీసుకొని పిన్నెల్లి సోదరులపై ఐపీసీ సెక్షన్ 307 కింద మర్డర్ అట్టెంప్ట్ కేసు ఫైల్ చేశారు.
ప్రస్తుతం సీఐ నారాయణ స్వామి తీవ్ర గాయాల పాలై హాస్పటల్‌లో పడ్డారు. ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరోవైపు, పిన్నెల్లి బ్రదర్స్ పరారీలో ఉన్నారు. ఈసీ వారిని త్వరగా పట్టుకోవాలంటూ పోలీసులను ఆదేశించింది. దాంతో వారు ఆ పనిలో పడ్డారు. సీన్ కట్ చేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సడన్‌గా ఏపీ హైకోర్టులో ప్రత్యక్షమయ్యారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ఫైల్ చేయగా.. పిన్నెల్లిపై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయమూర్తి ఎన్నికల సంఘానికి, పోలీసులను ఆదేశించారు. దాంతో అతడు ఉపశమనం పొందారు. అయితే ఈ కేసులు అన్ని నిరూపితమైతే పిన్నెల్లి బ్రదర్స్ బతుకు బస్టాండే కానీ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: