అప్పటివరకు పవన్ కు సీఎం కుర్చీపై ఆశల్లేవా.. పవన్ టార్గెట్లు వేరే ఉన్నాయా?

Reddy P Rajasekhar
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పట్లో సీఎం సీటుపై ఫోకస్ పెట్టే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. ఏపీలో కూటమి గెలిచినా ఓడినా పవన్ 2033 వరకు సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకోరని భోగట్టా. ప్రస్తుతం ఏపీలో వైసీపీని ఓడించడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని ఆ లక్ష్యం సాధిస్తే భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. 2033 తన టార్గెట్ అని పవన్ జన సైనికులతో చెప్పారని పొలిటికల్ వర్గాల టాక్.
 
అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వయస్సు 55 అంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. 2033 సంవత్సరం అంటే అప్పుడు పవన్ వయస్సు 64 సంవత్సరాలు. జగన్, చంద్రబాబులకు ఉన్న విధంగా పవన్ కు మీడియా సపోర్ట్ లేదు. ప్రస్తుతం బాబు అనుకూల మీడియా పవన్ కు ప్రాధాన్యత ఇస్తున్నా ఆ ప్రాధాన్యత తాత్కాలికం అని చెప్పాల్సిన అవసరం లేదు.
 
పవన్ దీర్ఘకాలిక లక్ష్యాలను ఎంచుకుని తప్పు చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. వైసీపీ పొరపాటున ఈ ఎన్నికల్లో ఓడిపోతే 2029లో మళ్లి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ అయితే ప్రజలు, ప్రేక్షకుల దృష్టిలో ఆయనపై ఎలాంటి ఒపీనియన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.
 
రాజకీయాల్లో 1 + 1 = 2 కాదని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో జనసేన విజయం సాధించే సీట్ల ఆధారంగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రణాళికలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. 2024 ఎన్నికల ఫలితాలు పవన్ పొలిటికల్ కెరీర్ ను పూర్తిస్థాయిలో డిసైడ్ చేయనున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ జనసేన భవిష్యత్ కార్యాచరణ్ గురించి స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: