టీపీసీసీ అధ్యక్షురాలిగా సీతక్క..కాంగ్రెస్‌ ఇక టీడీపీగా మారుతోందా?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో... అందరూ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త పిసిసి అధ్యక్షున్ని నియమించే పనిలో పడిందట. ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి బాధ్యతలను చేపడుతున్నారు. ఇక ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేపథ్యంలో... పిసిసి అధ్యక్ష పదవిని మరొకరికి అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. మరో వారం లేదా పది రోజుల్లో... లేకపోతే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత... కొత్త పిసిసి అధ్యక్షులు రాబోతున్నారట.
అయితే ఈ పదవి కోసం ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పెద్దలు, యంగ్ లీడర్లు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు, టికెట్ రాని వారు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. ఢిల్లీకి వెళ్లి మరి.. కాంగ్రెస్ అగ్ర నేతల వద్ద తమ వినతులు ఇస్తున్నారట తెలంగాణ లీడర్లు. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెను సంచలనం తెరపైకి వచ్చింది. తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా ఐరన్ లేడీ, తెలంగాణ మంత్రి సీతక్కను నియామకం చేయాలని కొత్త డిమాండ్ తెరపైకి వచ్చినట్లు సమాచారం.
అధిష్టానానికి కూడా సీతక్క పేరును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే... అధిష్టానం కూడా వినే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. దీంతో సీతక్క పిసిసి అధ్యక్షురాలు అవుతారని సమాచారం. అయితే ఇప్పటికే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి, మధు యాష్కి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ లాంటి సీనియర్ లీడర్లు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు.ఇలాంటి నేపథ్యంలో సీతక్కకు పదవి ఇస్తే... కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన ఇస్తారాకు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది కాంగ్రెస్. అలాగే ఇప్పుడు తీసేసి అధ్యక్ష పదవి టిడిపి నుంచి వచ్చిన సీతక్కకు ఇస్తే... కాంగ్రెస్లో ఏ ఒక్క నాయకుడు ఉండడానికి అంటున్నారు. అటు.. సీతక్క పిసిసి అధ్యక్షురాలు అవుతూ... గులాబీ పార్టీకి కూడా అసలు సిసలైన ఆయుధం దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలుగుదేశం పార్టీగా మారిపోయిందని... ఇప్పటికే గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు సీతక్కకు ఆ పదవి ఇస్తే... కాంగ్రెస్ను ఒక ఆట ఆడుకుంటుంది గులాబీ పార్టీ. మరి ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: