జ‌గ‌న్ బ‌ల‌గం : ఏపీ సంక్షేమ ర‌థానికి రావ‌త్ చ‌క్రాలు.. !

RAMAKRISHNA S.S.
- ఏపీ స‌ర్కార్ సంక్షేమానికి వెన్నుముక షంషేర్ సింగ్ రావ‌త్
- అమ్మఒడి, చేయూత స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌
( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
షంషేర్ సింగ్ రావ‌త్. సుదీర్ఘ‌కాలంగా ఏపీలో పనిచేస్తున్న ఉత్త‌రాదికి చెందిన అధికారి. అయితే.. జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత‌.. ఆయ‌నలో ఉన్న ప‌నితీరును గుర్తించారు. నేరుగా తీసుకువ‌చ్చి.. ఆర్థిక శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా నియ‌మించుకున్నారు. అంతే.. అక్క‌డినుంచి జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న ప‌థకాల తీరు తెన్నులు మారిపోయాయి. నిజానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అంటేనే సంక్షేమ ప్ర‌భుత్వం అనే పేరు వ‌చ్చింది. దీనికి కార‌ణం.. రావ‌త్ అని అంటారు.

ఎందుకంటే.. ఏటా 60 వేల కోట్ల‌కు పైగా నిధుల‌ను సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌కు అందించారు. ఈ సొమ్ములు స‌మ‌కూర్చ‌డంలో రావ‌త్‌దే పెద్ద‌పాత్ర‌.. అంతేకాదు.. నిధులు లేన‌ప్పుడు కూడా ఆయ‌న త‌న వ్యూహాల‌ను అమ‌లు చేసి. సీఎం జ‌గ‌న్ ఇబ్బంది ప‌డ‌కుండా చూసుకున్నారు. అమ్మ ఒడి స‌హా చేయూత వంటి ప‌థ‌కాలు.. పెద్ద ఎత్తున అమ‌లుచేశారు వీటికి ల‌క్ష‌ల కోట్ల రూపాయలు కావాల్సి ఉంది. ఈ స‌మ‌యంలో రావ‌త్ కేంద్రం నుంచి అన్ని మార్గాల్లోనూ నిధులు రప్పించేలా చ‌క్రం తిప్పారు.

స్వ‌యంగా ఆయ‌నే వెళ్లి కేంద్రం పెద్ద‌ల‌తో మాట్లాడినిదులు తెచ్చిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర బ‌డ్జెట్‌ను పేద‌ల‌కు చేరువ చేయ‌డంలోనూ.. బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌లోనూ రావ‌త్‌ది ప్ర‌ధాన పాత్ర‌. కీల‌క ప‌థ‌కాల్లో కొంత మేర‌కు భారం త‌గ్గించే చ‌ర్య‌లు తీసుకున్న‌ది కూడా.. ఈయ‌నే. ఉదాహ‌ర‌ణ‌కు అమ్మ ఒడిలో రూ.2000ల‌ను పాఠ‌శాల‌ల‌కు వెచ్చించ‌డం ద్వారా.. త‌ల్లిదండ్రుల‌ను నేరుగా ఆయా పాఠ‌శాల‌ల అభివృద్దిలో భాగం చేశారు.

అలానే సంక్షేమ ప‌థ‌కాల‌ను అందరికీ అందించ‌డంలోనూ ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు. ఇటు స‌ర్కారు సంక్షేమం.. అటు నిధుల రాక‌ను స‌మన్వ‌యం చేయ‌డంలోనూ.. ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డికి ఇబ్బంది లేని విధంగా ప్ర‌గ‌తి ర‌థంలో ఆర్థిక తీరును న‌డిపించ‌డంలోనూ.. రావ‌త్ విశేష కృషి చేశారు. అంతేకాదు.. ఉద్యోగులు ఉద్య‌మాలు చేసిన‌ప్పుడు కూడా.. వారికి ఆర్థిక ప‌రిస్థితిని వివ‌రించ‌డంలోనూ రావ‌త్ ముందున్నారు. ఇలా.. రావ‌త్ త‌న ప‌నితీరుతో సీఎం జ‌గ‌న్ సంక్షేమ ర‌థాన్ని ఆయ‌న ముందుకు న‌డిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: