ధ‌నుంజ‌య్‌రెడ్డి.. సీఎం జగ‌న్‌కు క‌ళ్లు - చెవులు ఈయ‌నే...!

RAMAKRISHNA S.S.
ఆర్. ధ‌నుంజ‌య్‌రెడ్డి. త‌ర‌చుగా ప్ర‌ధాన మీడియాలో ఈయ‌న పేరు వ‌స్తూ వుంటుంది. దీనికి కార‌ణం.. సీఎంవోలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించే తీరు. ప్ర‌భుత్వ ప‌రంగానే కాకుండా.. రాజ‌కీయ ప‌రంగా కూడా.. షార్ప్ షూట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు ధనుంజ‌య్‌రెడ్డి. అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు.. సీఎం జ‌గ‌న్‌ను స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేసింది. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌కాశం జిల్లా వైసీపీలో మంట‌లు చెల‌రేగాయి. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస‌రెడ్డి సొంత పార్టీపై అలిగారు.

త‌న‌కు వైవీ సుబ్బారెడ్డి చెక్ పెడుతున్నార‌ని.. విలువ లేకుండా చేశార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. ఈ స‌మ‌యంలో క‌థ సీఎంవో వ‌ర‌కు వ‌చ్చింది. ఈ సమ‌యంలో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ను సీఎం జ‌గ‌న్ నేరుగా ధ‌నుంజ‌య్‌రెడ్డికి అప్ప‌గించారు. దీనిలో జోక్యం చేసుకున్న ధ‌నుంజ‌య్‌రెడ్డి.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి.. ఇరు వ‌ర్గాల‌ను శాంతింప జేశారు. బాలినేని కోరిన 25వేల మంది ఇంటి ప‌ట్టాల నిధులు కూడా మంజూరు చేయించారు.

ఈ ఒక్క విష‌యంలోనే కాదు.. ప్ర‌భుత్వ ప‌రంగా కూడా ఆయ‌న చ‌క్రం తిప్పారు. ఎక్క‌డ అభివృద్ధి నిలిచిపోయినా.. ఎక్క‌డ ఎమ్మెల్యేలు గాడిత‌ప్పుతున్నా.. ఆయ‌న స‌వివ‌రంగా సీఎం జ‌గ‌న్‌కు చెప్పేవారు. ఫ‌లితంగా ఆయా జిల్లాల్లో మార్పుల‌కు సీఎం జ‌గ‌న్ శ్రీకారం చుట్టేవారు. ఇక‌, సీఎంజ‌గ‌న్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేయాల్సి వ‌స్తే.. అక్కడి అధికారుల‌ను కూడా స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుకు సాగారు. ఎక్క‌డా చిన్న తేడా రాకుండా.. అంతా తానై వ్య‌వ‌హ‌రించారు.

సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం స‌హా.. ఆయ‌న బ‌స్సు యాత్ర‌ల రూట్ మ్యాప్‌ను తొలుత ప‌రిశీలించి.. మార్పులు చేర్పులు చేసింది కూడా.. ధ‌నుంజ‌య్‌రెడ్డే. అంతేకాదు..  ఏ ఎమ్మెల్యే ఎక్క‌డ నుంచి వ‌చ్చినా సీఎంక‌ల‌వడానికి ముందు ధ‌నుంజ‌య్‌రెడ్డిని క‌లిస్తే.. త‌మ స‌మ‌స్య సగం తీరిపోతుంద‌ని లెక్క‌లు వేసుకుని.. ఆయ‌న‌ను క‌లుసుకునేవారు. అలానే వారి స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యేవి. అదేవిధంగా ఎమ్మెల్యేల‌పై ఒక క‌న్నేసి ఉంచేవారు. వారు పొరుగు పార్టీలతో సంబందాలు పెట్టుకున్నా.. వెంట‌నే సీఎంకు చెప్పేవారు. ఇలా.. సీఎం జ‌గ‌న్‌కు క‌ళ్లు-చెవులు అన్న‌ట్టుగా ధ‌నుజ‌య్ రెడ్డి వ్య‌వ‌హ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: