డ్వాక్రా మహిళల నెత్తిన పాలు పోసిన జగన్.. మళ్లీ సీఎం అయితే జీవితాలు మారినట్లే?

Reddy P Rajasekhar
ఏపీలో డ్వాక్రా మహిళలకు మేలు చేకూర్చేలా జగన్ వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ లాంటి పథకాలను అమలు చేశారు. ఈ రెండు పథకాలు డ్వాకా మహిళల జీవితాలలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి. వైఎస్సార్ ఆసరా స్కీమ్ తో 2019 సంవత్సరం ఏప్రిల్ 11 వరకు ఉన్న రుణాలను మాఫీ చేసిన జగన్ సున్నా వడ్డీ స్కీమ్ ద్వారా డ్వాక్రా మహిళలపై వడ్డీ భారం పడకుండా చేశారు.
 
అయితే రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళల జీవితాలు మారిపోనున్నాయని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డ్వాక్రా మహిళలకు 32 వేల 190 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈ మధ్య కాలంలో కొత్తగా పొదుపు సంఘాలలో చేరిన మహిళలకు సైతం రుణాలు ఇవ్వాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్టు భోగట్టా.
 
డ్వాక్రా మహిళల తలరాతలను మార్చే విధంగా జగన్ సర్కార్ నిర్ణయాలు ఉన్నాయని నెటిజన్ల నుంచి సైతం కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ సంస్థలు, బ్యాంకులతో జగన్ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుని రాష్ట్రంలోని మహిళలు సొంతంగా వ్యాపారాలు నిర్వహించడానికి జగన్ సర్కార్ తన వంతు సహాయసహకారాలు అందించింది. డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ తక్కువ వడ్డీకే రుణాలను అందించడం గమనార్హం.
 
మహిళలకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిన నేపథ్యంలో డ్వాక్రా మహిళల ఓట్లన్నీ జగన్ కే పడ్డాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం డ్వాక్రా మహిళల దశ తిరిగినట్లేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేసున్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల జీవితాలను మార్చేసిన వ్యక్తిగా జగన్ పేరు సొంతం చేసుకున్నారు. కూటమి మేనిఫెస్టోలో డ్వాక్రా మహిళలకు మేలు చేసేలా ఎక్కువ పథకాలను ప్రకటించలేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: