బీజేపీ: 305 సీట్లతో హ్యాట్రిక్..!

Divya
ఈసారి ఎన్నికలతో బిజెపి  హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. అంతేకాకుండా 400కు పైగా సీట్లతో విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. అయితే ఇలాంటి సమయంలోనే ముస్లింల రిజర్వేషన్, ఇతర కులాల రిజర్వేషన్లు తీసివేసెలా బిజెపి కుట్ర చేస్తోందని పలువురు రాజకీయ నేతలు, పార్టీలు  తెలియజేయడంతో బిజెపి అధికారంలోకి రాదేమో అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే చాలా సర్వేలు బిజెపి అధికారంలోకి రావడం ఖాయం అనే విధంగా తెలియజేస్తున్నాయి.

లోక్సభలో బిజెపి పార్టీ 305  ప్లస్ ఆర్ మైనస్ 10  సీట్లు వస్తాయని అమెరికన్ పొలిటికల్ సర్వే తో పాటు గ్లోబల్ సర్వే ఎన్నికల రిస్కు కన్సల్టెన్స్ ఇయన్ ప్రేమన్ అంచనా వేశారు. నేడు అనిచ్చితిక  ప్రపంచంలో భారతీయ ఎన్నికలలో మాత్రమే స్థిరమైన రాజకీయ సంఘటనలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఎన్డిటీవీతో మాట్లాడుతూ.. భారతదేశ అద్భుతమైన జనాభా కలిగిన దేశం అని అలాగే చాలా బలమైన మూలగల దేశం. దశాబ్ద పని తీరు మాత్రం తక్కువగా ఉందని.. ప్రపంచం చూసిందని తెలిపారు.  అమెరికాకు చాలామంది సీఈవోలు భారతదేశం నుంచి వచ్చారని తెలిపారు. అయినప్పటికీ కూడా భారతదేశం ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగానే ఉందని తెలియజేశారు.

అయితే వచ్చే ఏడాదికి భారత్ ప్రపంచంలోనే నాల్గవ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని..2028 నాటికి మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు. దేశం వృద్ధి పుంజుకోవడం మనం చూస్తూనే ఉన్నామునీ తెలిపారు. ప్రపంచ వేదికగా భారత జాతీయ అంతర్గత నిర్వహించేస్తోంది అంటూ..అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత ప్రభావాన్ని ఎత్తిచూపారు. భారతదేశ పెరుగుదల ప్రపంచం సానుకూలంగా చూస్తున్నప్పటికీ.. ఆ పెరుగుదల ప్రపంచానికి ముప్పుగా భావించడం లేదని తెలిపారు. సానుకూల వార్తలులేని ప్రపంచ  ఆర్థిక వ్యవస్థలో ఈ పెరుగుదల నిర్మాణాత్మకంగా భావన పరిగణించబడుతోంది. అందుకే పశ్చిమ ప్రపంచం భారత్ వైపున శ్రద్ధ చూపిస్తోంది అంటూ ఇయన్ ప్రేమన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసిన వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: