ఎన్నికల ఫలితాలకు ముందు జగన్‌ కు బిగ్‌ షాక్‌ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో... వైసిపి పార్టీకి ఏపీ హైకోర్టులో చుక్కెదురయింది. వైసిపి నేతలు వేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు... డిస్మిస్ చేసేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీన ఉద్రిక్తతలు నడుమ జరిగిన సంగతి తెలిసిందే. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలాచోట్ల ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించారు.
అయితే చంద్రగిరి, పల్నాడు, సత్తెనపల్లి అలాగే మాచర్ల నియోజకవర్గాలలో తీవ్రస్థాయిలో గొడవలు, అల్లర్లు జరిగాయి. దీంతో గొడవలు జరిగిన ప్రాంతాలలో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతలు రిగ్గింగ్ చేశారని... కాబట్టి ఆ ప్రాంతాలలో కచ్చితంగా రీపోలింగ్ నిర్వహించాల్సిందేనని ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది వైసిపి.
అక్కడ ప్రయోజనం లేకపోవడంతో... తాజాగా ఏపీ హైకోర్టును ఆశ్రయించింది వైసిపి. సత్తెనపల్లి, చంద్రగిరి నియోజకవర్గాలలో రీపోలింగ్ నిర్వహించాలని అంబటి రాంబాబు, మోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ విచారణ చేసిన ఏపీ హైకోర్టు... వైసిపి నేతలకు ఊహించని షాక్ ఇచ్చింది. ఏపీ మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. సత్తనపల్లిలో 4 పోలింగ్ బూతులలో రీపోలింగ్ జరపాలని అంబటి రాంబాబు వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. చంద్రగిరిలో రీపోలింగ్ జరపాలని మోహిత్ రెడ్డి వేసిన పిటిషన్ కూడా ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడం ఇక్కడ గమనార్హం. దీంతో వైసిపి పార్టీకి ఊహించని షాక్ తగిలినట్లు అయింది. మరి దీనిపై వైసిపి ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ఈ కాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో నేపథ్యంలో... అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: