ఏపీ: కూటమిలో కీలక నేతలే ఓడిపోతున్నారే.. ఎవరెవరు అంటే..?

Suma Kallamadi
నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి లో reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోమిరెడ్డి 1994లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1999లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన రెడ్డి, 2004 వరకు అదే నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చారు. చాలా కాలంగా టీడీపీలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు అయితే ఈ ప్రముఖ టీడీపీ నేత గెలిచే అవకాశాలు ఈసారి చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి కాకాని గోవర్ధన రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనే గెలవచ్చని అంటున్నారు.
చీపురుపల్లిలో కళా వెంకట్రావు కూడా ఓడిపోతారు ఇక్కడ రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న ప్రజల్లో బాగా ఆదరణ ఉన్న బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఆయన చీపురుపల్లి నియోజకవర్గానికి మంచి చేస్తారు కాబట్టి అతన్ని కాదని కళా వెంకట్రావును గెలిపించే అవకాశాలు ఉండకపోవచ్చు. పుంగనూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన చాలా బలమైన నేత అని చెప్పవచ్చు. పుంగనూరులో గెలుస్తూ వస్తున్నారు. ఎవరూ కూడా ఆయనను ఇప్పటిదాకా ఓడించలేదు. ఈసారి టీడీపీ వాళ్లు పరోక్షంగా బీసీపీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ను రంగంలోకి దింపారు. టీడీపీ నుంచి అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డిని నిలబెట్టారు. ఈయన టీడీపీ పార్టీలో ప్రముఖుడే కానీ గెలవడం కష్టం.
 రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి నిలుచున్న టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఓడిపోవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి రాజంపేట‌ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిథున్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుమారుడు వెంకటమిథున్‌ రెడ్డిని ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తుంటారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన పనితీరు ఏంటో అందరికీ తెలిసిందే కాబట్టి ఆయనకు ప్రజలు ఓటు వేసి ఉండకపోవచ్చు కాబట్టి గెలవడం కష్టం. కడప నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధవి రెడ్డి కూడా గెలవడం గగనమే. మొత్తం మీద చూసుకుంటే వీరందరూ ఓడిపోయే సూచనలే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా మరి కొంత మంది ప్రముఖులు కూడా ఓటమి పాలు కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: