ఏపీ: మంత్రి పదవికి ఆమడదూరంలో లోకేష్?

Suma Kallamadi
ఈసారి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఆసక్తిగా మారిన అసెంబ్లీ సెగ్మెంట్ల లిస్టులో మంగళగిరి కూడా ఒకటి. ఎందుకంటే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వారసుడు నారా లోకేష్ అక్కడ నుండే పోటీలో ఉన్నారు కాబట్టి, ఆ ప్రత్యేకత సంతరించుకుంది. విషయం ఏమిటంటే, ఎన్నికల రిజల్స్ట్స్ కి ఇంకా 11 రోజులు గడువు వుంది. ఈలోపు ఎవరి ఊహాగానాలు వారికున్నాయి. ఈసారి కూడా అధికారంలోకి వస్తామని వైస్సార్సీపీ స్టేట్మెంట్స్ ఇస్తుంటే, ఈసారి అధికారం మాదంటే మాదేనంటూ టీడీపీ కూటమి ధీమాగా చెబుతోంది. ఈ క్రమంలోనే కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే కీలక మంత్రిత్వ శాఖలు ఎవరికి ఇస్తారు? అన్న అంశం పైన చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి.

అవును, ప్రస్తుతం దానికి సంబందించిన అంశాలే కొందరు ఔత్సాహికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది విచిత్రంగా హోం శాఖ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి తరువాత అంతటి పవర్ ఫుల్ శాఖ అదే. అలాంటి ఈ కీలక శాఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలని అంతా కోరుతున్నారు... పైగా దానికి అర్హుడు కూడా పవనే అంటూ కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా మిగిలిన శాఖలు విషయంలో కూడా రాసుకొస్తున్నారు. కానీ అందులో బాబు వారసుడు లోకేష్ బాబు లేకపోవడం ఇపుడు టీడీపీ కార్యకర్తలకు మింగుడు పడడం లేదనే గుసగుసలు వినబడుతున్నాయి.
ఇకపోతే, అయితే ఇంత జరుగుతున్న దాని మీద మాత్రం టీడీపీ ఇంతవరకు రెస్పాండ్ కాకపోవడం ఇపుడు చాలామందికి అయోమయంలోకి నెట్టేస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని గుసగుసలు వినబడుతున్నాయి. అదేమంటే లోకేష్ ని రాబోయే రోజుల్లో కేవలం పార్టీని పైపైన చూసుకోవడానికే పరిమితం చేయనున్నారని టాక్ వినబడుతోంది. అయితే కొంతమంది టీడీపీ అభిమానులు అయితే హోమ్ శాఖ ఖచ్చితంగా లోకేష్ బాబుదేనంటూ ధీమాని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా బాబు గాని, లోకేష్ గాని దీనిపైన స్పందించక పోవడం గమనార్హం. ప్రస్తుతం వారు టూర్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే లోకేష్ ఈసారి మంత్రి పదవికి దూరంగా ఉంటారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: